-అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా మరో వారం రోజుల్లోనే రిలీజ్ ఉండటంతో పుష్ప ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. ఇప్పటికే పాట్నా, చెన్నైలో భారీ ఈవెంట్స్ నిర్వహించారు…తాజాగా కేరళలోని కొచ్చిలో పుష్ప 2 ఈవెంట్ నిర్వహించారు. కేరళలో బన్నీ సినిమాలన్నీ రిలీజ్ అవుతాయి. అక్కడ బన్నీని మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు ఫ్యాన్స్. కేరళలో బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఇవాళ కేరళలో జరగుతున్న ఈవెంట్‌కు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు.
గత 20 సంవత్సరాలుగా కేరళ అభిమానులు చూపిస్తున్న ప్రేమకు బన్నీ థ్యాంక్స్ చెప్పారు. పుష్పలో ఫాహాద్ పాజిల్‌తో వర్క్ చేయడం ఆనందకరమన్నారు. ఆర్య సినిమాతోనే మలయాళంలో కూడా తనకు మార్కెట్ మొదలైందని అల్లు అర్జున్ తెలిపారు. ఈ సందర్భంగా కేరళ ఫ్యాన్స్‌కు బన్నీ ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. పుష్ప 2 సినిమాలో ఒక సాంగ్ మొదట్లో మలయాళం లిరిక్స్ ఉంటాయన్నారు. అన్ని భాషల్లోనూ ఆ పాటలో లిరిక్స్ మళయాళంలోనే ఉంటాయి బన్నీ వెల్లడించారు. అలాగే ఆ పాట ప్రోమోని కూడా అక్కడ ప్లే చేసారు.
ఈవెంట్లో అల్లు అర్జున్ ఏం మాట్లాడాడో దిగువన చూడండి….
ఇక గురువారం గోవాలో జరుగుతున్న 55వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల ముగింపు వేడుకకు ఐకాన్ స్టార్ హాజరుకానున్నారు. రష్మికతో కలిసి అక్కడి రెడ్ కార్పెట్‌పై సందడి చేయనున్నారు. ఇలా గ్యాప్ లేకుండా అన్నీ ఈవెంట్లకు వెళ్లి బన్నీ తమ సినిమాను ప్రమోట్ చేయడం అభిమానుల్లో జోష్ పెంచుతోంది. ఇక ఇదే ఎనర్జీతో నవంబర్ 29న ముంబై ఈవెంట్‌ని, నవంబర్ 30న బెంగళూరుకు వెళ్లనున్నారు బన్నీ. పుష్ప 2: రూల్ డిసెంబర్ 5 న విడుదల అవ్వనున్న సంగతి తెలిసిందే.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.