Guntur Kaaram: ‘మా సైడ్ నుంచి అదే తప్పు అనుకుంటున్నాం’.. ‘గుంటూరు కారం’ నిర్మాత నాగవంశీ కామెంట్స్..

|

Jan 20, 2024 | 10:28 AM

సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. వారం రోజుల్లో రూ.212 కోట్లు గ్రాస్ రాబట్టింది. అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన రీజనల్ సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. అమ్మ సెంటిమెంట్, మాస్ కమర్షియల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ మూవీపై మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ఇదివరకే నిర్మాత దిల్ రాజు, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి గుంటూరు కారం మూవీ రివ్యూస్, కలెక్షన్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Guntur Kaaram: మా సైడ్ నుంచి అదే తప్పు అనుకుంటున్నాం.. గుంటూరు కారం నిర్మాత నాగవంశీ కామెంట్స్..
Guntur Kaaram, Nagavamshi
Follow us on

అల వైకుంఠపురంలో.. సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రూపొందించిన సినిమా గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఈసినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. వారం రోజుల్లో రూ.212 కోట్లు గ్రాస్ రాబట్టింది. అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన రీజనల్ సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. అమ్మ సెంటిమెంట్, మాస్ కమర్షియల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ మూవీపై మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ఇదివరకే నిర్మాత దిల్ రాజు, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి గుంటూరు కారం మూవీ రివ్యూస్, కలెక్షన్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇక తాజాగా మరోసారి నిర్మాత నాగవంశీ గుంటూరు కారం కలెక్షన్స్, రిజల్ట్ గురించి ప్రెస్ మీట్ పెట్టి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సినిమాను ఫ్యామిలీ అడియన్స్ బాగా ఆస్వాదిస్తున్నారని.. తల్లికొడుకుల సెంటిమెంట్ అందరికీ కనెక్ట్ అయ్యిందని…అందుకే మంచి వసూళ్లు రాబడుతుందని అన్నారు.

నాగవంశీ మాట్లాడుతూ.. “మా సినిమా విడుదలైన వారం రోజులు అయ్యింది. వసూళ్లు చాలా బాగున్నాయి. ఇప్పటికే బయ్యర్స్ బ్రేక్ ఈవెన్ దగ్గర్లోకి వచ్చేశారు. అందరికీ డబ్బులు వస్తున్నాయి. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టాం. కలెక్షన్స్ ఫేక్ అనే వాళ్లు ప్రూవ్ చేయొచ్చు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ పట్టించుకోము. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా గురించి ఫ్యామిలీ అడియన్స్ మాట్లాడిన వీడియోస్ చూస్తున్నాము. కాకపోతే .. అర్ధరాత్రి ఒంటిగంటకు షోలు వేయడం .. సినిమాను ఫ్యామిలీ ఎమోషనల్ లా ప్రమోట్ చేయలేకపోవడమే మా సైడ్ నుంచి తప్పు అనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని అందరూ మాస్ సినిమా అనుకున్నారు. మాస్ తోపాటు ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉండి వాళ్ల అంచనాలు అందుకోలేకపోయాం.

మధ్యాహ్నం నుంచి ఫ్యామిలీ అడియిన్స్ వెళ్లాక సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అడియన్స్ కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. ప్రీమియర్ షోస్ రివ్యూస్ చూసి షాకయ్యాను. కానీ సాయంత్రానికి ఈ సినిమా పై పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇది ఈ సినిమాను సరిగ్గా ప్రమోట్ చేయలేకపోవడమే మా సైడ్ తప్పు అనుకుంటున్నాం. ఇది వన్ మ్యాన్ షో కాదు.. టూ మ్యాన్ షో.. త్వరలోనే గ్రాండ్ సక్సెస్ పార్టీ నిర్వహించాలని అనుకుంటున్నాం” అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.