Dil Raju: సినీ ప్రియులకు శుభవార్త చెప్పిన దిల్ రాజ్.. ఎఫ్ 3 టికెట్స్ పై క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్….

|

May 18, 2022 | 1:51 PM

ఫుల్ కామెడీ ఎంటర్టైనర్‏గా రాబోతున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా.. మెహ్రీన్ ఫిర్జాదా హీరోయన్లుగా నటిస్తున్నారు.

Dil Raju: సినీ ప్రియులకు శుభవార్త చెప్పిన దిల్ రాజ్.. ఎఫ్ 3 టికెట్స్ పై క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్....
F3
Follow us on

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఎఫ్ 3. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్‏గా రాబోతున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా.. మెహ్రీన్ ఫిర్జాదా హీరోయన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ మూవీపై మరింత ఆసక్తిని కలిగించాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఎఫ్ 3 సినిమా టికెట్స్ రేట్స్ పై క్లారిటీ ఇచ్చారు నిర్మాత దిల్ రాజ్.

ఇటీవల స్టార్ హీరోల సినిమాలు విడుదలకు ముందే టికెట్స్ ధరలు పెంచుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్, ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలకు టికేట్ ధరలు పెంచాయి.. దీంతో ఇప్పుడు రాబోయే సినిమాలకు సైతం టికేట్ ధరలు పెంచుతారా ? అనే సందేహాలు సినీ ప్రియులు వ్యక్తమవుతున్నాయ. ఈ క్రంలో తాజాగా ప్రొడ్యూసర్ దిల్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. ఎఫ్ 3 సినిమాకు టికెట్ రేట్లు పెంచడం లేదని.. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఈ సినిమాను విడుదల చేయనున్నట్లుగా తెలిపారు. దీంతో సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. మురళీ శర్మ, సోనాల్ చౌహాన్, సునీల్, ఆలీ కీలకపాత్రలలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి