AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: డార్లింగ్ అప్‌కమింగ్ సినిమాల పై సేమ్ స్ట్రాటజీ.. ఇంట్రస్టింగ్ టాక్..

డార్లింగ్ ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ సినిమాలు సీక్వెల్స్ గా రానున్నాయా..? బాహుబలి తరువాత ప్రభాస్ తో సినిమా అంటే సీక్వెల్ ఉండాల్సిందే అని మేకర్స్ ఫిక్స్ అవుతున్నారా..?

Prabhas: డార్లింగ్ అప్‌కమింగ్ సినిమాల పై సేమ్ స్ట్రాటజీ.. ఇంట్రస్టింగ్ టాక్..
Prabhas
Rajeev Rayala
|

Updated on: Apr 09, 2022 | 9:57 AM

Share

డార్లింగ్ ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ సినిమాలు సీక్వెల్స్ గా రానున్నాయా..? బాహుబలి తరువాత ప్రభాస్ తో సినిమా అంటే సీక్వెల్ ఉండాల్సిందే అని మేకర్స్ ఫిక్స్ అవుతున్నారా..? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ డిస్కషన్‌. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న డార్లింగ్ సినిమాలన్నింటికీ సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మాస్ యాక్షన్ హీరో, పాన్ ఇండియా సూపర్ స్టార్‌, డార్లింగ్.. ఇలా ప్రభాస్‌కు చాలా ట్యాగ్స్ ఉన్నాయి.. కానీ వీటన్నింటికి మించి ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ ట్యాగ్‌ యాడ్ అయ్యింది. డార్లింగ్ లైనప్ విషయంలో వినిపిస్తున్న న్యూస్, రూమర్స్‌తో డార్లింగ్ పేరు ముందు కొత్త ప్రీ ఫిక్స్ యాడ్ అయ్యింది. బాహుబలితో ఇండియన్ బాక్సాఫీస్‌ను రెండు సార్లు షేక్ చేశారు డార్లింగ్‌ ప్రభాస్‌. ఈ మూవీ రెండు భాగాలుగా రిలీజ్ కావటంతో తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నింటికీ సీక్వెల్స్‌ ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది..

బాహుబలి తరువాత రిలీజ్ అయిన సాహో విషయంలోనూ ఇలాంటి ప్రచారమే జరిగింది. సాహో వరల్డ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందంటూ ప్రమోషన్ టైమ్‌లో హింట్ ఇచ్చారు డైరెక్టర్ సుజిత్. కానీ సినిమా అనుకున్న రేంజ్‌లో సక్సెస్‌ కాకపోవటంతో సీక్వెల్‌ ప్లాన్‌ను డ్రాప్ చేసేశారు. కొద్ది రోజులుగా సలార్ సినిమా విషయంలోనూ ఇదే ప్రచారం జరుగుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారన్న న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతుంది. ప్రజెంట్ కేజీఎఫ్‌ను కూడా రెండు భాగాలుగా ప్లాన్ చేసిన కెప్టెన్ ప్రశాంత్ నీల్‌ సలార్‌కి కూడా సేమ్ స్ట్రాటజీ అప్లై చేస్తున్నారట. లేటెస్ట్‌గా ఆదిపురుష్ విషయంలో ఇదే న్యూస్ ట్రెండ్ అవుతోంది. రామయాణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారన్నది నార్త్ ఫిలిం సర్కిల్స్‌లో నయా అప్‌డేట్‌. ఇలా వరుసగా ప్రభాస్ సినిమాలకు సీక్వెల్స్‌ అన్న న్యూస్‌ వైరల్ అవుతుండటంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Yami Gautam: ‘నన్ను దిగజార్చాలని చూస్తున్నారు, నా హృదయం ముక్కలయ్యింది’.. ఆవేదన వ్యక్తం చేసిన బాలీవుడ్‌ బ్యూటీ.

RRR Movie: టాలీవుడ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోన్న ఆర్ఆర్ఆర్.. వెయ్యి కోట్లను దాటేస్తూ..

Viral Photo: ఎల్లోరా శిల్పం.. అందాల నయాగారం.. ఓర చూపులు చూస్తోన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా!

Follow Us
కాకరకాయ ఉల్లికారం.. కాకరకాయ ఫ్రై ఇలా చేస్తే అస్సలు చేదు ఉండదు!
కాకరకాయ ఉల్లికారం.. కాకరకాయ ఫ్రై ఇలా చేస్తే అస్సలు చేదు ఉండదు!
మొబైల్ దొంగతనం అనుమానంతో వ్యక్తి హత్య..
మొబైల్ దొంగతనం అనుమానంతో వ్యక్తి హత్య..
అబ్బో వీటి రుచి చూస్తే వదళ్లేరు.. టేస్టీ టేస్టీ కారం బోండాల తయారీ
అబ్బో వీటి రుచి చూస్తే వదళ్లేరు.. టేస్టీ టేస్టీ కారం బోండాల తయారీ
ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే మంచూరియా.. మిల్మేకర్‌తో ఎలా చేయాలంటే?
ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే మంచూరియా.. మిల్మేకర్‌తో ఎలా చేయాలంటే?
చెవి సమస్య వస్తే నడకలోనూ తేడా వస్తుంది ఎందుకో తెలుసా?
చెవి సమస్య వస్తే నడకలోనూ తేడా వస్తుంది ఎందుకో తెలుసా?
బాధితులకు భరోసా.. హిట్‌ అండ్ రన్ కేసుల్లో పరిహారం పొందడం ఎలా?
బాధితులకు భరోసా.. హిట్‌ అండ్ రన్ కేసుల్లో పరిహారం పొందడం ఎలా?
ప్రతీ శనివారం బ్యాంక్‌లకు హాలీడే..? కేంద్రం క్లారిటీ ఇదే..
ప్రతీ శనివారం బ్యాంక్‌లకు హాలీడే..? కేంద్రం క్లారిటీ ఇదే..
నీ దారికి నువ్వే వెలుగవ్వాలి.. మీ జీవితాన్ని మార్చే బుద్ధుడి కథ!
నీ దారికి నువ్వే వెలుగవ్వాలి.. మీ జీవితాన్ని మార్చే బుద్ధుడి కథ!
వ్యక్తి చనిపోయిన తర్వాత ఆధార్ కార్డును ఏం చేయాలి?
వ్యక్తి చనిపోయిన తర్వాత ఆధార్ కార్డును ఏం చేయాలి?
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..