
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా దూకుడు ఇప్పట్లో తగ్గేలా లేదు. జూన్ 27న విడుదలైన ఈ సినిమా కేవలం రెండు వారల్లోనే రూ.1000 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ లోనూ ప్రభాస్ సినిమా దుమ్ము రేపుతోంది. ప్రస్తుతం కల్కి థియేటర్లు హౌజ్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. ఇక శుక్రవారం (జులై 12) విడుదలైన భారతీయుడు 12 కూడా నెగెటివ్ టాక్ రావడంతో కల్కి కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఐ మ్యాక్స్ థియేటర్ యాజమాన్యం సినిమా ఆడియె్న్స్ కు ఒక బంపరాఫర్ ఇచ్చింది. ఒకటి టికెట్ కొంటే మరోక టికెట్ ఫ్రీ అంటూ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదు. కేవలం ఫ్యామిలీ అండ్ ఫీమెల్ ఆడియెన్స్ కు మాత్రమే. అది కూడా వరల్డ్ బిగ్గెస్ట్ ఐ మ్యాక్స్ స్క్రీన్ థియేటర్లో మాత్రమే. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన మరో విషయమేమిటంటే. ఈ ఆఫర్ కూడా ఇండియాలో కాదు. అమెరికాలోని లాస్ ఎంజెల్స్ బిగ్గెస్ట్ ఐమ్యాక్స్ స్క్రీన్ టీసీఎల్ చైనీస్ థియేటర్లో మాత్రమే. కల్కి సినిమాకు ఓవర్సీస్ లోనూ సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కనివినీ ఎరుగని రీతిలో కలెక్షన్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ శనివారం (జూలై 13) లాస్ ఎంజెల్స్లోని టీసీఎస్ చైనీస్ థియేటర్ని సందర్శించనున్నారు.
ఈ సందర్భంగానే డైరెక్టర్ తో కలిసి సినిమా చూసేందుకు ఫ్యామిలీ, ఫీమేల్ ఆడియన్స్నిక ఐమాక్స్ టీసీఎల్ చైనీస్ థియేటర్ యాజమాన్యం ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన ఇస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. దీనిని వైజయంతీ మూవీస్ సంస్థ కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ ఆఫర్ చూసిన సినిమా ప్రేక్షకులు థియేటర్లోనూ ఈ ఆఫర్ ప్రకటిస్తే బాగుంటుందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.