Gabbar Singh : తొమ్మిదేళ్లయినా తెలుగు సినిమాను వదలని గబ్బర్ సింగ్ మేనియా…

|

May 12, 2021 | 7:06 PM

రెక్లెస్ యూనిఫామ్ తో.. మెళ్ళో ఎర్ర టవల్ వేసుకుని.. ఐటెం సాంగ్ లో మాస్ డ్యాన్స్ వేసే పోలీసాఫీసర్..! గతంలో ఎప్పుడూ తెరమీద చూడలేదే అని కొత్తగా రిసీవ్ చేసుకున్నాడు తెలుగు ప్రేక్షకుడు.

Gabbar Singh : తొమ్మిదేళ్లయినా తెలుగు సినిమాను వదలని గబ్బర్ సింగ్ మేనియా...
Follow us on

Gabbar Singh :

2012 మే 11… గబ్బర్ సింగ్ మూవీ రిలీజైన రోజు. తెలుగు సినిమాల్లో పవర్ స్టార్ మేనియా మళ్ళీ వేళ్ళూనుకున్నరోజు కూడా అదే. ఇవ్వాళ్టికి సరిగ్గా తొమ్మిదేళ్లయింది. అయినా గబ్బర్ సింగ్ తాలూకు సౌండ్స్ ఇప్పటిదాకా టాలీవుడ్ లో అడపాదపా వినిపిస్తూనే ఉంటాయ్. ఎందుకు? గబ్బర్ సింగ్ మూవీ ఎందుకు అంత గొప్ప ట్రెండ్ సెట్టర్ అయింది? రెక్లెస్ యూనిఫామ్ తో.. మెళ్ళో ఎర్ర టవల్ వేసుకుని.. ఐటెం సాంగ్ లో మాస్ డ్యాన్స్ వేసే పోలీసాఫీసర్..! గతంలో ఎప్పుడూ తెరమీద చూడలేదే అని కొత్తగా రిసీవ్ చేసుకున్నాడు తెలుగు ప్రేక్షకుడు. హిందీ నుంచి ఎడాప్ట్ చేసుకున్నదే అయినా గబ్బర్ సింగ్ క్యారెక్టరైజేషన్లో తనదైన మార్క్ చూపించారు డైరెక్టర్ హరీష్ శంకర్. అందుకే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సినిమాల్లో పోలీస్ రోల్స్ ఇలా కూడా ఉండొచ్చనడానికి ఒక రోల్ మోడల్ అయింది గబ్బర్ సింగ్ మూవీ. అంతలా కనెక్ట్ అయ్యారు గనుకే మళ్ళీ అదే పేరుతో సేమ్ క్యారెక్టర్ ని రిపీట్ చేసుకున్నారు పవర్ స్టార్. తర్వాత వరసబెట్టి థిక్ స్కిన్డ్ పోలీస్ క్యారెక్టర్లకి తెలుగులో చాలామంది హీరోలు కమిటయ్యారు. అంతకుముందే దూకుడు మూవీలో ఖాకీ క్యారెక్టర్ ని ఫన్నీ ఫ్లేవర్స్ తో చూపించిన శ్రీను వైట్ల.. ఆగడులో దానికి కొత్త ఎలివేషన్స్ ఇచ్చారు. ఎన్ కౌంటర్ శంకర్ పాత్రలో సూపర్ స్టార్ చూపించిన పంచ్ పవర్ ఎవర్ గ్రీన్ అనిపించింది.

పూరి జగన్నాధ్ కూడా ఆడియెన్స్ కి కొత్త రకం పోలీస్ ని పరిచయం చేసి సక్సెస్ కొట్టేశారు. డిపార్ట్ మెంట్ పరువు తియ్యడానికే పుట్టా అంటూ టెంపర్ వున్న పోలీసాఫీసర్ గా అదరగొట్టేశారు యంగ్ టైగర్ ఎన్టీయార్. సగానికి పైగా సినిమాలో నెగిటివ్ షేడ్స్ తోనే కనిపించినా… తన టెరిఫిక్ పెర్ఫామెన్స్ తో ప్రేక్షకుడికి సూపర్ గా కనెక్ట్ అయ్యారు తారక్. విక్రమార్కుడు లాంటి ఐకానిక్ పోలీస్ క్యారెక్టర్స్ గతంలోనే చేసిన మాస్ మహారాజ్ రవితేజ.. రీసెంట్ గా క్రాక్ మూవీతో నెక్స్ట్ వెర్షన్ చూపించారు. సీఐ పోతరాజు వీరశంకర్ అనే ఖతర్నాక్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ని రాసుకున్నప్పుడు గోపీచంద్ మలినేనికి స్ఫూర్తి గబ్బర్ సింగేనట. అదీ… తొమ్మిదేళ్లయినా తెలుగు సినిమాని వదిలిపెట్టబోనంటున్న గబ్బర్ కా మేనియా.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anushka Shetty: ఎన్నో సినిమాలు ఫైన‌ల‌య్యాయి.. కానీ ఒక్క‌టి కూడా ప‌ట్టాలెక్క‌డం లేదు.. ఏంటి స్వీటీ సంగ‌తి..!

Shyam Singha Roy movie: ఈసారి డిటెక్టివ్ గా మారి నవ్వులు పూయించనున్న నాని..

Khiladi Movie: రవితేజ సినిమాకు భారీ ఆఫర్.. ఖిలాడి డిజిటల్ రైట్స్ కోసం అన్ని కోట్లు ఆఫర్ చేసిన సంస్థ ?