Pawan Kalyan: ఫ్యాన్స్‌కు పూనకాలే.. హరి హర వీరమల్లు లుక్‌లో పవర్ స్టార్..

|

Dec 06, 2022 | 7:57 PM

వీటిల్లో అత్యంత క్యూరియాసిటీని రేకెత్తిస్తున్న సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "హరిహర వీరమల్లు". 15వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యపు కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ఇప్పటికే సినీ అభిమానుల్లో విపరీతమైన హైప్‌ను..

Pawan Kalyan: ఫ్యాన్స్‌కు పూనకాలే.. హరి హర వీరమల్లు లుక్‌లో పవర్ స్టార్..
Pawan Kalyan
Follow us on

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక యమా స్పీడ్ గా సినిమాలను లైన్లో పెట్టేస్తూ.. దూసుకుపోతున్నారు. వీటిల్లో అత్యంత క్యూరియాసిటీని రేకెత్తిస్తున్న సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “హరిహర వీరమల్లు”. 15వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యపు కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ఇప్పటికే సినీ అభిమానుల్లో విపరీతమైన హైప్‌ను.. క్రియేట్ చేసింది. రిలీజ్‌ కోసం ఈగర్‌గా వెయిట్ చేసేలా చేస్తోంది. ఇక ఇప్పటికే రిలీజైన “హరిహర వీరమల్లు” ఫస్ట్ లుక్ యూట్యూబ్‌ను షేక్ చేసి మిలియన్ల కొద్దీ వ్యూస్‌ ను రాబట్టగా… తాజాగా రిలీజైన వీడియో గింప్ల్ కూడా.. యూట్యబ్‌లో సూపర్ రెస్పాన్స్‌ను రాబడుతోంది.

పవన్ బర్త్‌డే సందర్భంగా రిలీజై ఈ వీడియో గింప్ల్స్‌… పవన్‌ సినిమాలో ఏ రేంజ్లో చెలరేగిపోతారో అన్నది అందరికీ చూపించేసింది. చూపించడమే కాదు.. మల్లయోదుకు పట్టి కరిపిస్తూ.. పవన్ తొడ కొట్టిన విధానం అందరికీ కిక్కిస్తోంది. సినిమా పై విపరీతమైన అంచనాలను పెంచేస్తోంది. తాజాగా ఈ మూవీ సెట్ నుంచి పవర్ స్టార్ ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. సెట్లో పవన్ ఓ లేడీ ఫ్యాన్ తో దిగిన ఫోటో ఇది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇంట్రవెల్ సందర్భంగా వచ్చే ఫైట్ సీన్ ఇది అని తెలుస్తోంది. ఈ ఒక్క ఫైట్ 20 నిముషాలు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ కూడా కనిపించనున్నారట. త్వరలోనే ఈ సినిమానుంచి టీజర్ రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

Pawan Kalyan