PSPK 28 : పవర్ స్టార్ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన హరీష్ శంకర్.. కేక పెట్టిస్తున్న పవన్ లుక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్. పవర్ స్టార్ వరసగా సినిమాలను లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే.

PSPK 28 : పవర్ స్టార్ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన హరీష్ శంకర్.. కేక పెట్టిస్తున్న పవన్ లుక్
Hareesh Shankar

Updated on: Sep 09, 2021 | 10:44 AM

PSPK 28 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్. పవర్ స్టార్ వరసగా సినిమాలను లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనకు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్‌తోపాటు అదిరిపోయే ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. పవన్‌ హీరోగా హరీష్ శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న  pspk28 ను మైత్రి మూవీమేకర్స్‌ భారీ జడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ చిత్రంలో పవన్‌ డ్యూయల్ రోల్స్‌ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ పూర్తి చేసిన డైరెక్టర్ హరీష్‌ శంకర్.. పవన్‌ సరసన నటించేందుకు హీరోయిన్‌‌ను వెతికే పనిలో పడ్డారు.

తాజాగా ఈ సినిమానుంచి విడుదల చేసిన టైటిల్, ఫస్ట్‌లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రాయల్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఢిల్లీలోని ఇండియా గెట్ దగ్గర స్టైలిష్ బైక్‌‌‌ను పార్క్ చేసి.. దానిమీద కూర్చొని టీ తాగుతున్న పవన్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంత నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఇక భవదీయుడు భగత్ సింగ్ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RC15: అయ్య బాబోయ్.. ఒక్క పోస్టర్ కే ఇంత ఖర్చా ? అంచనాలు పెంచేస్తోన్న శంకర్-చరణ్ సినిమా..

SP Balasubrahmanyam: దుబాయ్ షేక్ నోట బాలసుబ్రహ్మణ్యం పాట.. పొల్లుపోకుండా పాడి ఫిదా చేశాడుగా..

Karthika Deepam: దీపను చంపడానికి మోనిత ప్రయత్నం.. కోర్టులో తాను నేరం చేయలేదన్న కార్తీక్!

 

Follow Us