Pawan Kalyan : ఏపీ మంత్రులు తనపై చేసిన విమర్శలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. జనసేన విస్తృత సమావేశం లో పవన్ మాట్లాడుతూ.. మీరు తిట్టేకొద్దీ తాను బలపడతాను కానీ బలహీనపడను అని అన్నారు. నేను మిమ్మల్ని మరచిపోను.. నేను యుద్దాన్ని ప్రకటించాను.. కానీ నన్ను లాగితే మాత్రం వెనక్కి వెళ్ళాను అంటూ వార్నింగ్ ఇచ్చారు పవన్. అలాగే తాను చాలా పద్దతిగా మాట్లాడుతున్నా అన్నారు. మనం ప్రతిరోజు టాక్స్‌లు కడుతున్నాం.. అవన్నీ ప్రభుత్వ ఖజానాలోకి చేరితే.. వాటిని ఒక అభివృద్ధి పద్దతిలో ప్రజలకు పంచాలి.. కానీ వాటిని అస్తవ్యస్తంగా ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. కిరాయి మూకలను..కోడి కత్తి గ్యాంగ్‌లతో భయపడితే భయపడను.. మీరు ఎవరితోనైనా పెట్టుకోండి..కానీ పవన్ కళ్యాణ్‌తో పెట్టుకోకండి తోలు తీస్తా అంటూ హెచ్చరించారు.
‘టికెట్ ధరలు పెంచితే నాకు వస్తాయా డబ్బులు.. నాకేమైనా ధియేటర్స్ ఉన్నాయా.. నాకు సినిమా మీద వ్యామోహం లేదు.. నాకు మొదటి జీతంగా అల్లు అరవింద్ గారు 5000 ఇచ్చారు పెద్దమనసు చేసుకొని.. అన్నారు పవన్. నేను అడిగేది ఏదంటే ఒకరి కష్టార్జితాన్ని దోచుకునే హక్కులేదు మీకు. అడుగుతున్నదానికి సమాధానం చెప్పే అలవాటు లేదా..? కుక్కలా అరుస్తున్నారు అంటూ విరుచుకుపడ్డారు పవన్. భగత్ సింగ్ జోహార్లు అర్పిస్తాం.. గాంధీజీ ముందు మోకరిల్లుతాం.. మీలాంటి వాళ్లకు తాటతీస్తాం.. అటు విరుచుకుపడ్డారు జనసేనాని.
మరిన్ని ఇక్కడ చదవండి :