బాలీవుడ్ నుంచి చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ లో సినిమాలు చేసిన విషయం తెలిసిందే.. అలా వచ్చిన వారిలో నిధి అగార్వల్ ఒకరు. బాలీవుడ్ లో మున్నా మైఖేల్ అనే సినిమాలో నటించింది ఈ అమ్మడు. ఆతర్వాత 2018లో వచ్చిన సవ్యసాచి సినిమాతో తెలుగులోకి అడుగుపపెట్టింది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆతర్వాత నాగచైతన్య తమ్ముడు అఖిల్ తో కలిసి సినిమా చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఇక 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిధి తన అందాలతో ఆకట్టుకుంది.
ఈ సినిమాలో తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఈ చిన్నదనికి వరుస అవకాశాలు వచ్చాయి. అలాగే తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంది. తమిళ్ లో శింబు, జయం రవి సరసన సినిమాలు చేసింది ఈ అమ్మడు. అలాగే మహేష్ బాబు మేనల్లుడు అశోక్ సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం అందుకుంది. హరిహరవీరమల్లు సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. ఇదిలాఉంటే తాజాగా నిధి అగర్వాల్ నెటిజన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
సోషల్ మీడియాలో నెటిజన్స్ తో మాట్లాడింది ఈ అమ్మడు. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే ‘మీకు తెలుగు వచ్చా మేడమ్?’ అని ఓ నెటిజన్ అడగ్గా దానికి నిధి అగర్వాల్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. నాకు తెలుగు వస్తుందండీ.. ఎందుకు మీకు ఆ డౌట్ ? ‘అందరికీ నమస్కారం’ అని చెప్పే బ్యాచ్ కాదు నేను’ అనిచెప్పుకొచ్చింది నిధి అగర్వాల్. అలాగే ప్రభాస్ రాజా సాబ్ సినిమా సెట్ లో ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి అని తెలిపింది. అలాగే పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి అంటే..”చాలా మంచి వారు. ఆయన ఓ లెజెండ్, పవర్‌ఫుల్ కళ్లు.. ఇలా ఆయన గురించి చాలా చెప్పొచ్చు. ఒక్క మాటలో అంటే కష్టం” అని తెలిపింది నిధిఅగార్వల్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.