Netflix: ఓ మై నెట్‏ఫ్లిక్సు.. టాలీవుడ్ హీరోలకు తెలుగు డబ్బింగ్ ఏంట్రా.. ఏడిసినట్లే ఉంది అంటోన్న నెటిజన్స్

ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో కలే అనుకున్న ఆస్కార్ అవార్డును తెలుగు సినిమాకు అందుకున్నారు. ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటకు హాలీవుడ్ డ్యాన్సర్స్ అదరగొట్టేశారు. సౌత్ సినిమాలకు పాన్ ఇండియా ట్రెండ్ తీసుకువచ్చి.. ట్రిపుల్ ఆర్ మూవీతో హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకున్న రాజమౌళి పై ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీకి 'మోడ్రన్ మాస్టర్స్' అనే టైటిల్ ఫిక్స్ చేసారు.

Netflix: ఓ మై నెట్‏ఫ్లిక్సు.. టాలీవుడ్ హీరోలకు తెలుగు డబ్బింగ్ ఏంట్రా.. ఏడిసినట్లే ఉంది అంటోన్న నెటిజన్స్
Rajamouli Documentary
Follow us

|

Updated on: Jul 23, 2024 | 11:17 AM

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డ్స్ సృష్టించారు. బాహుబలి 1, 2 చిత్రాలతో కలెక్షన్స్ సునామి సృష్టించిన జక్కన్న.. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో కలే అనుకున్న ఆస్కార్ అవార్డును తెలుగు సినిమాకు అందుకున్నారు. ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటకు హాలీవుడ్ డ్యాన్సర్స్ అదరగొట్టేశారు. సౌత్ సినిమాలకు పాన్ ఇండియా ట్రెండ్ తీసుకువచ్చి.. ట్రిపుల్ ఆర్ మూవీతో హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకున్న రాజమౌళి పై ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీకి ‘మోడ్రన్ మాస్టర్స్’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.

పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న ఈ డాక్యుమెంటరీని ఆగస్ట్ 2 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో జేమ్స్ కామెరూన్, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, కరణ్ జోహార్, రమా రాజమౌళి ఇలా పలువురు జక్కన్న గురించి మాట్లాడారు. చివరగా రాజమౌళి మాట్లాడుతూ.. నేను కేవలం నా కథకు మాత్రమే బానిసగా ఉంటాను అని చెప్పడం గమనార్హం. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది.. కానీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ విడుదల చేసిన ఈ ట్రైలర్ పై నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఓ మై నెట్ ఫ్లిక్సు.. నీకు దండం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఎందుకంటే తాజాగా విడుదలైన ట్రైలర్ లో రాజమౌళి గురించి టాలీవుడ్ హీరోస్ ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ చాలా గొప్పగా చెప్పారు. కానీ వారికి నెట్ ఫ్లిక్స్ డబ్బింగ్ చెప్పించింది. ఇక్కడ అసలు కథ మలుపు తిరిగింది. తెలుగు హీరోలకు తెలుగు డబ్బింగ్ చేప్పించాలనే సాహసం అసలు నెట్ ఫ్లిక్స్ ఎలా చేసింది..? పోనీ ఆ డబ్బింగ్ మన హీరోలకు సెట్ అయ్యిందా ?.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే డిస్కవరీ, నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్ తెలుగులో చూసినట్లు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ కంపానియన్ స్టూడియోలతో కలిసి ఈ డాక్యుమెంటరీని నిర్మించింది నెట్ ఫ్లిక్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓ మై నెట్‏ఫ్లిక్సు.. టాలీవుడ్ హీరోలకు తెలుగు డబ్బింగ్ ఏంట్రా..
ఓ మై నెట్‏ఫ్లిక్సు.. టాలీవుడ్ హీరోలకు తెలుగు డబ్బింగ్ ఏంట్రా..
బడ్జెట్ ప్రసంగం ఇక్కడ లైవ్ వీక్షించండి
బడ్జెట్ ప్రసంగం ఇక్కడ లైవ్ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. లైవ్ వీడియో
బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. ఆమె పేరిట రికార్డులెన్నో..
బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. ఆమె పేరిట రికార్డులెన్నో..
చారిత్రాత్మకంగా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు.. అంత స్పెషల్ ఏంటంటే?
చారిత్రాత్మకంగా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు.. అంత స్పెషల్ ఏంటంటే?
గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిపోయిన ఐఏఎస్‌ అధికారి భార్య.. తాజాగా
గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిపోయిన ఐఏఎస్‌ అధికారి భార్య.. తాజాగా
ఆ పాట కోసం సీతారామ శాస్త్రిని పబ్‏కి తీసుకెళ్లిన డైరెక్టర్..
ఆ పాట కోసం సీతారామ శాస్త్రిని పబ్‏కి తీసుకెళ్లిన డైరెక్టర్..
మెట్ల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఆర్థికంగా నష్టం తప్పదు
మెట్ల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఆర్థికంగా నష్టం తప్పదు
జీతభత్యాలు పొందే వ్యక్తులకు శుభవార్త? ఆర్థిక సర్వేలో కీలక అంశాలు
జీతభత్యాలు పొందే వ్యక్తులకు శుభవార్త? ఆర్థిక సర్వేలో కీలక అంశాలు
ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఇది..! ఎక్కడో కాదు మన దేశంలోనే
ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఇది..! ఎక్కడో కాదు మన దేశంలోనే