తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ ప్రణీత సుభాష్. బావ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీకి ఎందుకో ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు. త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. కానీ ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో అంతగా కనిపించలేదు. కథానాయికగా, సెకండ్ హీరోయిన్గా అలరించిన ప్రణీత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. బెంగుళూరుకు చెందిన తన స్నేహితుడు నితిన్ రాజును పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప జన్మించింది. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ప్రణీత.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలలో సందడి చేస్తుంది. అలాగే కన్నడలో ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది.
ఇటీవల సోషల్ మీడియాలో వరుసగా ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది ప్రణీత. అలాగే తన కూతురితో కలిసి గడిపే ప్రతి క్షణాన్ని నెట్టింట అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ప్రణీత షేర్ చేసిన వీడియోపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇలాంటివి చేయడం ఆపేయ్.. ముందు ఆ వీడియోను డెలీట్ చేయ్ అంటూ సీరియస్ అవుతున్నారు. ఇంతకీ ప్రణీత పై నెటిజన్స్ ఎందుకు ఫైర్ అవుతున్నారో తెలుసా.. ? అందుకు కారణం ఆమె బాత్ టబ్ వీడియోను షేర్ చేయడమే.
బాత్ టబ్ వీడియోలో నురగతో ఆటలాడుతూ కనిపించింది ప్రణీత. ఇక ప్రణీత వీడియోపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి వీడియోస్ ఎందుకు షేర్ చేస్తున్నావు.. ఇలాంటి వీడియోస్ చేయడం ఆపేయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రణీతకు సపోర్ట్ చేస్తున్నారు. తెలుగులో సరైన అవకాశం వస్తే రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది ప్రణీత. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.