NBK 107: సంక్రాంతికి థియేటర్లలో బాలయ్య సందడి.. ‘ఎన్​బీకే 107’కు పిచ్చెక్కించే టైటిట్

Updated on: Oct 21, 2022 | 8:33 PM

బాలయ్య లుక్ చూసే అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పుడు టైటిల్‌ చూసి సంబరాలు చేసుకుంటున్నారు. ఇది కదా మాకు కావాల్సింది అంటూ విజిల్స్ వేస్తున్నారు.

నందమూరి బాలయ్య కెరీర్‌లో ఇప్పుడు పీక్ స్టేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఓ వైపు ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ అంటూ దుమ్ములేపుతూనే.. మరోవైపు వరుస సినమాలు చేస్తున్నారు. కాగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమా టైటిల్‌ను కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద రివీల్ చేశారు. దీనికి  ‘వీరసింహారెడ్డి’ అనే టైటిల్ ఖరారు చేశారు. అభిమానుల సమక్షంలో టైటిల్ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ బాలయ్య డైలాగ్స్ చెబుతూ ఫుల్ ఎంజాయ్ చేశారు. సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. బాలయ్య నుంచి అభిమానులు ఏమేం కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయని డైరెక్టర్ గోపి తెలిపారు. ఇందులో బాలకృష్ణ సరసన శ్రుతిహాసన్‌ ఆడిపాడనుంది.  తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. రాయలసీమ బ్యాగ్రౌండ్‌లో ఈ సినిమా తీశారు. నెక్ట్స్ సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Published on: Oct 21, 2022 08:20 PM
Loading...
Unable to load recommendations.
Follow Us