Jersey Deleted Scene: నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన సినిమాల్లో జెర్సీ (Jersey)కి ప్రత్యేక స్థానముంటుంది. క్రికెట్ బ్యాక్ డ్రాప్లో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ముఖ్యంగా ఈ సినిమాలో నాని నటన, అతను పలికించిన హావభావాలు అభిమానుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇక 2019లో జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో జెర్సీ సినిమాకు ఏకంగా రెండు విభాగాల్లో జాతీయ పురస్కారాలు రావడం విశేషం. అందుకే ఇతర భాషల్లోనూ ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే టైటిల్‌తో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ హిందీ రీమేక్‌లో నటిస్తున్నాడు. తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరే హిందీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా తెలుగులో ఈ సినిమా విడుదలై నేటితో (ఏప్రిల్19)తో మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ జెర్సీ నుంచి ఓ డిలీటెడ్ సీన్ వీడియో (Jersey Deleted Scene) ను విడుదల చేశారు.
ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో క్రికెట్ శిక్షణ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న నాని దగ్గరకు శ్రద్ధ శ్రీనాథ్ తండ్రి (సంజయ్ స్వరూప్) వస్తాడు. రూ.50వేలు తీసుకుని ఈ డబ్బు ఎక్కడివ్వాలో అక్కడిచ్చి కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగం తిరిగి తెచ్చుకోమని సలహా ఇస్తాడు. ‘నన్ను వెతుక్కుంటూ వచ్చి ఈ డబ్బులు ఇస్తున్నందుకు థ్యాంక్స్.. కానీ నాకు ఈ డబ్బులు అవసరం లేదు’ అని నాని చెబుతాడు. దీంతో ‘నువ్వెప్పటికీ టీమిండియా తరపున ఆడలేవు’ అంటూ నానిపై కోప్పడతాడు సంజయ్. అయితే ఇవేవీ పట్టించుకుని నాని తన దారిన తాను వెళ్లిపోతాడు. సీరియస్, ఎమోషనల్‌గా సాగుతున్న ఈ సీన్లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
Also Read:Acharya: భలే భలే బంజారా రెస్పాన్స్ అదుర్స్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న తండ్రికొడుకులు..
Vijay Devarakonda- Samantha: ఖుషీ రీమేక్ లో… సమంత, విజయ్ దేవరకొండ
మరీ ఇంత దారుణమా… ప్రభాస్‌కు బాలీవుడ్లో ఘోర అవమానం