Nani : న్యూ ఇయర్ కు స్పెషల్ గిఫ్ట్ రెడీ చేస్తున్న నేచురల్ స్టార్.. అంటే.. సుందరానికీ! సినిమా నుంచి..

|

Dec 31, 2021 | 8:12 AM

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో హిట్ అందుకున్న నాని ఇప్పుడు నెక్స్ట్ కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ లో జాయిన్ అవుతున్నాడు.

Nani : న్యూ ఇయర్ కు స్పెషల్ గిఫ్ట్ రెడీ చేస్తున్న నేచురల్ స్టార్.. అంటే.. సుందరానికీ! సినిమా నుంచి..
Nani
Follow us on

Nani : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో హిట్ అందుకున్న నాని ఇప్పుడు నెక్స్ట్ కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ లో జాయిన్ అవుతున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత నాని సినిమా థియేటర్ లో సందడి చేసింది. రాహుల్ దర్శకత్వంలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకూండా వసూళ్ల పరంగాను లాభాలు తెచ్చిపెట్టింది. శ్రీకాంత్ ఓదెల్ల దర్శఖత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు దసరా అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో సాగనుంది. మొదటి నాని ఈ సినిమా తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఈ సినిమాతో పాటు అంటే సుందరానికి అనే మరో సినిమాను కూడా లైన్ లో పెట్టాడు ఈ నేచురల్ స్టార్.

అంటే.. సుందరానికీ!” చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ‘బ్రోచేవారేవరురా’ ‘మెంటల్ మదిలో’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక్..ఇప్పుడు మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నారు చిత్రయూనిట్.  ”అంటే.. సుందరానికీ!” చిత్రం నుంచి సుందరం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. నూతన సంవత్సరం కానుకగా 2022 జనవరి 1న సాయంత్రం 04.05 గంటలకు నాని లుక్ విడుదల కానుంది. నాని ఈ సినిమాలో ‘K.P.V.S.S.P.R సుందర ప్రసాద్’ అనే పాత్రలో కనిపిస్తారని తెలిపారు. ఇందులో నాని సరసన నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని – యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Coronavirus: బాలీవుడ్‌లో ఆగని కరోనా ప్రకంపనలు.. వైరస్‌ బారిన పడిన బాహుబలి ‘మనోహరి’

Prabhas: డార్లింగ్‌ మనసు బంగారం.. రాధేశ్యామ్‌ ప్రీరిలీజ్‌లో గాయ పడిన అభిమానుల కోసం..

Jr.NTR: ఆ సమయంలో డిప్రెషన్‏లోకి వెళ్లాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్..