
బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమాల్లో ఒకటైన భైరవ ద్వీపం మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. 1994లో విడుదలైన ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు ఇప్పుడు మరిన్ని హంగులు అద్ది రీ రిలీజ్ చేయనున్నారు. 4కె రిజుల్యూషన్‌తో ఆగస్టు 5న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నారు. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ జానపద సినిమాలో రోజా హీరోయిన్గా నటించింది. రంభ ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది. అప్పట్లో ఫాంటసీ మూవీల్లో భైరవ ద్వీపం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఏకంగా తొమ్మిది నంది అవార్డులను సొంతం చేసుకొని రికార్డులు కొల్లగొట్టింది. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ సినిమానే మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. కాగా బాలయ్య నటించిన చెన్న కేశవరెడ్డి, నరసింహనాయుడు సినిమాలు థియేటర్లలో మళ్లీ రిలీజైన సంగతి తెలిసిందే. అభిమానులను కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడిదే కోవలో భైరవ ద్వీపం కూడా విడుదల కానుంది.
కాగా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవత్ కేసరి అనే సినిమా చేస్తున్నారు బాలయ్య. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, శ్రీలీల బాలయ్య కూతురిగా కనిపించనుంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీంతో పాటు వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ డైరెక్షన్‌లోనూ ఓ మూవీ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు బాలయ్య.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..