Radhe Shyam : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమానుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. జిల్ సినిమాతో మంచి హిట్ అందుకున్న రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. మొనీమధ్య విడుదలైన విక్రమాదిత్య క్యారెక్టర్ టీజర్ దాదాపు 60 గంటలకు పైగా యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగింది. తెలుగు ఇండస్ట్రీలో మరే సినిమాకు సాధ్యంకాని రికార్డుల్ని రాధే శ్యామ్ తిరగరాసింది. ఇందులో రెబల్‌స్టార్ ప్రభాస్ భవిష్యత్ ని చెప్పగలిగే విక్రమాదిత్యగా కనిపించనున్నారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇటలీలో జరిగే ప్రేమకథగా “రాధే శ్యామ్” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ సినిమానుంచి సెకండ్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. వీడియో సాంగ్ లో సిద్ శ్రీరామ్ వాయిస్ తో రొమాంటిక్ టచ్ ఇచ్చారు. ఈ రోమియో, జూలియట్ ప్రేమకథకు జస్టిన్ ప్రభాకరన్ అందమైన సంగీతన్ని అందించారు. కృష్ణకాంత్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఇక ఈ పాట విజివాల్ పరంగానూ ఆకట్టుకుంటుంది. జనవరి 14, 2022న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతోపాటు ప్రభాస్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :