Naga Chaitanya: సమంత మళ్లీ కలిస్తే ఏం చేస్తారు ?.. నాగచైతన్య షాకింగ్ ఆన్సర్..

ఇటీవలే సినిమా గురించి కాకుండా.. పర్సనల్ లైఫ్ గురించి వచ్చే ప్రశ్నలతో తాను విసిగిపోయానంటూ ఆసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Naga Chaitanya: సమంత మళ్లీ కలిస్తే ఏం చేస్తారు ?.. నాగచైతన్య షాకింగ్ ఆన్సర్..
Chaitanya

Updated on: Aug 09, 2022 | 8:44 PM

టాలీవుడ్ యువసామ్రాట్ నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా.. గత కొద్ది రోజులుగా చైతూ పలు ఇంటర్వ్యూలలో పాల్గోంటున్నాడు. ఈ క్రమంలో లాల్ సింగ్ చద్దా సినిమా గురించి మాత్రమే కాకుండా.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటీవలే సినిమా గురించి కాకుండా.. పర్సనల్ లైఫ్ గురించి వచ్చే ప్రశ్నలతో తాను విసిగిపోయానంటూ ఆసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి సమంత (Samantha) గురించి ఎదురైన ప్రశ్నకు చైతూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు.

ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న చైతూకు ర్యాపిడ్ ఫైర్ రౌండ్‏లో భాగంగా సమంత మళ్లీ ఎదురైతే ఏం చేస్తారు? అని యాంకర్ అడగ్గా.. ఆమెకు హాయ్ చెబుతానన్నారు చైతూ. అలాగే తన వ్యక్తిగత జీవితం.. వృత్తిపరమైన జీవితంపై ప్రభావం చూపించకుండా ఉండేలా చూసుకుంటున్నట్లు తెలిపారు. చాలా మంది పర్సనల్ లైఫ్‏కు.. వృత్తిపరమైన జీవితానికి కనెక్ట్ చేస్తారని.. తాను అలా ఎప్పటికీ కనెక్ట్ చేయనని.. ఈ రెండింటి మధ్య చాలా స్పష్టమైన అడ్డంకును ఏర్పర్చుకున్నట్లు చెప్పారు చైతూ. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన ఈ మూవీ ఆగస్ట్ 11న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us