
సినిమాల ప్రభావం జనాలపై ఎంతగా ఉంటుందో.. పాటల ప్రభావం కూడా కాస్త ఎక్కువగానే జనాలపై ఉంటుంది. కేవలం సినిమా పాటలే కాదు, ఫోక్ సాంగ్స్, మాస్ సాంగ్స్, భక్తిగీతాలు ఇలా చాలా రకాల పాటలు శ్రోతలను ఆకట్టుకుంటుంటాయి. ఈ మధ్యకాలంలో ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ తో పోటీ పడుతున్న విషయం తెలిసిందే.. సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతుంటే.. ఫోక్ సాంగ్స్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. నెలకు పది ఫోక్ సాంగ్స్ విడుదలవుతున్నాయి. అలాగే విడుదలైన అన్ని సాంగ్స్ మంచి వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. అయితే కేవలం సినిమా పాటలు, ఫోక్ సాంగ్స్ మాత్రమే కాదు భక్తి పాటలు కూడా శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఎప్పుడూ లవ్ సాంగ్స్, మాస్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ మాత్రమే కాదు ఈ భక్తి పాటలను వినండి. ఇప్పుడు ఓ భక్తి పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఎన్నో వేల భక్తిపాటలు ఉన్నాయి. అన్ని మంచి భావాన్ని ఆధ్యాత్మిక అర్ధాన్ని కలిగి ఉంటాయి. వాటిలో ఈ సాంగ్ ఒకటి. అది మరేదో కాదు అయ్యప్ప స్వామి మల్లెపూల పల్లకి సాంగ్. అయ్యప్ప భక్తులకు అత్యంత ఇష్టమైన పాట ఇది.
యూట్యూబ్ లో మల్లెపూల పల్లకి సాంగ్ మీద డీజే వెర్షన్స్ చాలా ఉన్నాయి. కానీ ఆ లిరిక్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. యూట్యూబ్ లో ఉన్న అయ్యప్ప సాంగ్స్ అన్నింటికీ మంచి వ్యూస్ ఉన్నాయి. భక్తులు ఈ పాటలను మళ్లీ మళ్లీ వింటున్నారు. ఈ సాంగ్ ను ఆలపించింది డప్పు శ్రీను, అలాగే ఈ సాంగ్ లిరిక్స్ రాసింది వాసు గురు స్వామి. ఆంజనేయులు ఈ పాటకు సంగీతం అందించారు. ఈ పాట మీరూ వినండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి