AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: సైకో పోలీస్‌గా సునీల్.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సైకో పోలీస్ గా సునీల్ అదరగొట్టాడు. హీరోకు సమానమైన రోల్ లో ఆకట్టుకున్నాడు. గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఈ మలయాళం సినిమా ఇప్పుడు ఓటీటీలో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

OTT Movie: సైకో పోలీస్‌గా సునీల్.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: Sep 09, 2026 | 7:50 PM

Share

ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన సునీల్ ఇప్పుడు విలన్ గానూ అదరగొడుతున్నాడు. ఒక్క తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, మలయాళం భాషా సినిమాల్లోనూ ప్రతినాయకుడిగా మెప్పిస్తున్నాడు. అలా సునీల్ విలన్ గా నటించిన ఓ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. అంతకు ముందు థియేటర్లలోనూ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పుడీ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఐదు ఓటీటీల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది. పేరుకు పీరియాడికల్ గ్యాంగ్ స్టర్ డ్రామానే అయినప్పటికీ 90ల నాటి రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా కథ సాగుతుంది. 1990ల కాలంలో తిరువనంతపురంలో స్థానిక వీధి రౌడీలు ఒక ఉమ్మడి శత్రువును ఎదుర్కొనేందుకు శ్రీలంక తమిళ తిరుగుబాటుదారుడితో చేతులు కలపడం, ఆ తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందీ సినిమా.

ప్రస్తుతం ఓటీటీలో ట్రెండింగ్ టాప్ ప్లేస్ లో దూసుకుపోతోన్న ఈ సినిమా పేరు అనంతన్ కాడు (Ananthan Kaadu). కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య ఈ సినిమాలో శ్రీలంక తమిళన్ పాత్రలో చాలా డిఫరెంట్ రోల్ లో కనిపించాడు. టాలీవుడ్ స్టార్ కమెడియన్ సునీల్, రెజినా కసాండ్రా, అజయ్, నిఖిలా విమల్, దేవ్ మోహన్, ఇంద్రన్స్, విజయ రాఘవన్, అచ్యుత్ కుమార్, శాంతి బాలచంద్రన్ వంటి ఎంతో మంది స్టార్స్ ఈ సినిమాలో నటించారు. కాగా ఇప్పటికే అనంతన్ కాడు ఏకంగా 5 ఓటీటీలలో ఒకేరోజున రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్, లయన్స్ గేట్ ప్లే, మనోరమ మ్యాక్స్‌లలో సెప్టెంబర్ 2న సునీల్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే ఇప్పుడీ సినిమా తెలుగు వెర్షన్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో మాత్రమే అనంతన్ కాడు తెలుగు భాషలో అందుబాటులో ఉంది. మంచి క్రైమ్ థ్రిల్లర్ అందులోనూ సైకో పోలీస్ పాత్రలో సునీల్ యాక్టింగ్ ను చూడాలనుకునేవారికి అనంతన్ కాడు ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

అనంతన్ కాడు సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us