Mrunal Thakur: అవును వదిలేస్తాను.. కానీ మనస్పూర్తిగా ప్రేమించాను.. మృణాల్ ట్వీట్ చూశారా..?

|

Dec 17, 2024 | 1:06 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా అడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

Mrunal Thakur: అవును వదిలేస్తాను.. కానీ మనస్పూర్తిగా ప్రేమించాను.. మృణాల్ ట్వీట్ చూశారా..?
Mrunal Thakur
Follow us on

సీతారామం సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత హాయ్ నాన్నతో మరో హిట్ అందుకుంది. ఇక విజయ్ దేవరకొండ సరసన ఈ బ్యూటీ నటించిన ఫ్యామిలీ స్టార్ మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. దీంతో పూర్తిగా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న మృణాల్.. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. ‘అవును వదిలేస్తాను.. కానీ మనస్పూర్తిగా ప్రేమించాను’ అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చింది. అయితే ఇది పర్సనల్ లైఫ్ గురించి కాదండోయ్.. తన కొత్త సినిమాను ప్రకటించింది.

ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత టాలీవుడ్ లో సైలెంట్ అయిన శ్రుతి హాసన్.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. హీరో అడివి శేష్, శ్రుతి హాసన్ జంటగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ డెకాయిట్. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ గతంలోనే విడుదలయ్యాయి. కొన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి శ్రుతి హాసన్ తప్పుకుందని వార్తలు వినిపించాయి. తాజాగా ఆ రూమర్స్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రం నుంచి శ్రుతి హాసన్ తప్పుకుంది. ఆమె స్థానంలోకి మృణాల్ ఠాకూర్ వచ్చింది.

తాజాగా అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా డెకాయిట్ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది మృణాల్. ‘అవును వదిలేస్తాను. కానీ మనస్పూర్తిగా ప్రేమించాను ‘ అంటూ రాసుకొచ్చింది. ఇక అందుకు రిప్లైగా అడవి శేష్ మరో పోస్టర్ రిలీజ్ చేస్తూ ‘అవును ప్రేమించావు. కానీ మోసం చేసావు. ఇడిచిపెట్టను.. తేల్చాల్సిందే’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరు షేర్ చేసిన పోస్టర్స్ వైరలవుతున్నాయి.

 

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.