Chiranjeevi-CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మెగాస్టార్ చిరంజీవి.. ఎందుకంటే..

| Edited By: Rajitha Chanti

Sep 16, 2024 | 1:52 PM

సీఎం రేవంత్ ఇంటికి వెళ్లి సీఎం ను కలిశారు మెగాస్టార్ చిరంజీవి .. ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టకా మొదటి సారి ఇరువురు కలుసుకున్నారు. ఇటీవల వచ్చిన వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖుల నుంటి పెద్ద మొత్తంలో విరాళాలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు , ఆయా సంస్థలు విరాళాలు అందజేయగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి తాను ప్రకటించిన విరాళం అందజేశారు మెగాస్టార్ చిరంజీవి.

Chiranjeevi-CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మెగాస్టార్ చిరంజీవి.. ఎందుకంటే..
Megastar Chiranjeevi, Cm Re
Follow us on

సీఎం రేవంత్ ఇంటికి వెళ్లి సీఎం ను కలిశారు మెగాస్టార్ చిరంజీవి .. ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టకా మొదటి సారి ఇరువురు కలుసుకున్నారు. ఇటీవల వచ్చిన వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖుల నుంటి పెద్ద మొత్తంలో విరాళాలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు , ఆయా సంస్థలు విరాళాలు అందజేయగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి తాను ప్రకటించిన విరాళం అందజేశారు మెగాస్టార్ చిరంజీవి. వరద బాధితుల కోసం రూ.50 లక్షలు విరాళంగా అందించారు చిరంజీవి. అలాగే రామ్ చరణ్ కూడా అదనంగా మరో రూ.50 లక్షలు సీఎం సహాయనిధికి అందజేశారు. ఈ రెండు చెక్కులను చిరంజీవి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీఎం నివాసంలో అందజేశారు.

అమర్ రాజా గ్రూప్ తరపున మాజీ మంత్రి గల్లా అరుణకుమారి రూ. కోటి విరాళాన్ని సీఎం సహాయనిధికి అందజేయాగా.. సినీ నటుడు అలీ రూ.3 లక్షలు, విశ్వక్ సేన్ రూ.10 లక్షల విరాళాన్ని సీఎం సహాయనిధికి అందజేశారు. జూబిలీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి చెక్కులను స్వయంగా అందజేశారు.

Cm Revanth Reddy

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.