
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. మన శంకరవరప్రసాద్ గారు ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో వరుసగా సినిమాఉల చేస్తున్నారాయన. ప్రస్తుతం చిరంజీవి బాబీ కొల్లి తో కాకా, వశిష్టతో విశ్వంభర, శ్రీకాంత్ ఓదెలతో సినిమాలు చేయనున్నాడు. అయితే ఇంత బిజీ షెడ్యూల్ లోనూ చిరంజీవి ఓ టాక్ షో చేయనున్నాడని తెగ ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఈ సెలబ్రిటీ టాక్ షోను ప్లాన్ చేస్తోందని, ఇందుకు మెగాస్టార్ ను హోస్ట్ గా వ్యవహరించనున్నారని సమాచారం. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన ప్రముఖులు చిరంజీవి టాక్ షోకు రానున్నారని, ఇప్పటికే ఈ షో కోసం రోడ్ మ్యాప్ పూర్తయ్యిందని టాక్.
ఇందుకు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు ఆల్రెడీ చిరంజీవి టీమ్ తో సంప్రదించారని, అతి త్వరలోనే ఈ టాక్ షో గురించి అధికారికంగా అనౌన్స్ మెంట్ చేయనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే సుమారు 47 ఏళ్ల సినిమా కెరీర్ లో చిరంజీవి పెద్దగా టాక్ షోలు చేయలేదు. కొన్నేళ్ల క్రితం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే క్విజ్ రియాలిటీ షోకు మాత్రమే హోస్ట్ గా వ్యవహరించారు. తనదైన స్క్రీన్ ప్రజెన్స్, హోస్టింగ్ తో షోను రక్తి కట్టించారు. దీని తర్వాత ఇప్పుడు మరో టాక్ షోకు మెగాస్టార్ రెడీ అవుతున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే ఈ సెలబ్రిటీ టాక్ షో కోసం చిరంజీవికి 200 కోట్ల రూపాయల భారీ పారితోషికాన్ని నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ చేసిందట. ఓటీటీ హిస్టరీలో ఓ టాక్ షో కోసం ఇంత భారీ అమౌంట్ ఆఫర్ చేయడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సినిమా సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారింది. ఒక వేళ ఇదే నిజమైతే ఓటీటీ హిస్టరీలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా చిరంజీవి మరో ఘనతను అందుకుంటారు. కాగా నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందనున్న చిరంజీవి టాక్ షోకి సంబంధించిన చర్చలు, ఒప్పంద వ్యవహారాలను చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని సమాచారం. త్వరలోనే ఈ టాక్ షోకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయని టాక్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి