Megastar Chiranjeevi: చిరు ఇంట్లో కమల్.. సల్మాన్ ఖాన్‏ సందడి.. స్పెషల్ ట్రీట్ ఇచ్చిన మెగాస్టార్..

|

Jun 12, 2022 | 11:46 AM

వీరితోపాటు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, విక్రమ్ చిత్రయూనిట్‏కు చిరు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ఈ వేడుకలో హీరో నితిన్.. మెగా ఫ్యామిలీ హీరోస్ పాల్గోన్నట్లుగా తెలుస్తోంది.

Megastar Chiranjeevi: చిరు ఇంట్లో కమల్.. సల్మాన్ ఖాన్‏ సందడి.. స్పెషల్ ట్రీట్ ఇచ్చిన మెగాస్టార్..
Kamal Chiranjeevi
Follow us on

విశ్వనటుడు కమల్ హాసన్.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ శనివారం రాత్రి మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి ఇంట్లో సందడి చేసినట్లుగా తెలుస్తోంది. వీరితోపాటు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, విక్రమ్ చిత్రయూనిట్‏కు చిరు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ఈ వేడుకలో హీరో నితిన్.. మెగా ఫ్యామిలీ హీరోస్ పాల్గోన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే . ఇందులో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించగా.. విజయ్ సేతుపతి, సూర్య, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించారు. జూన్ 3న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్ లో విక్రమ్ సక్సెస్ సెలబ్రెషన్స్ నిర్వహించారు. అనంతరం విక్రమ్ చిత్రయూనిట్ కు మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో స్పెషల్ ట్రీట్ ఇచ్చారు.

ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హీరో కమల్ హాసన్ ఘనంగా సన్మానించారు చిరు.. అనంతరం. కమల్ పై, విక్రమ్ సినిమాపై.. ప్రశంసలు కురిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. విక్రమ్ సినిమా అద్భుత విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా కాలం తర్వాత మెగాస్టార్ , కమల్ హాసన్ అపూర్వ కలయిక చూసి ఫిదా అవుతున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిరు ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్‏టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.