Ganesh Chaturthi: మెగాస్టార్‌ ఇంట ఘనంగా గణేశ్‌ చతుర్థి సంబరాలు.. మనవరాలు చేసిన పనికి మురిసిపోయిన చిరంజీవి

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో కలిసి తన నివాసంలో వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకున్నారు. తమ పూజా మందిరంలో ఏర్పాటు చేసిన మట్టి గణపయ్యకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

Ganesh Chaturthi: మెగాస్టార్‌ ఇంట ఘనంగా గణేశ్‌ చతుర్థి సంబరాలు.. మనవరాలు చేసిన పనికి మురిసిపోయిన చిరంజీవి
Megastar Chiranjeev

Updated on: Aug 31, 2022 | 9:29 PM

Megastar Chiranjeevi: దేశమంతటా గణేశ్‌ చతుర్థి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ చూసినా గణేశ్‌ మండపాలు, భక్తుల రద్దీనే కనిపిస్తున్నాయి. సామాన్యులతో సహా వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం తమ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అందరికీ పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో కలిసి తన నివాసంలో వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకున్నారు. తమ పూజా మందిరంలో ఏర్పాటు చేసిన మట్టి గణపయ్యను భక్తి శ్రద్ధలతో కొలుచుకున్నారు. తల్లి అంజనాదేవి, భార్య సురేఖలతో పాటు కూతురు శ్రీజ, మనవరాలు నవిష్కతో కలిసి స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేశారు.

ఈ సందర్భంగా తమ పూజా మందిరంలో ఏర్పాటు చేసిన మట్టి గణపయ్యకు భక్తితో పూజలు నిర్వహించారు చిరంజీవి. తల్లి అంజనాదేవి, సతీమణి సురేఖ, కూతురు శ్రీజ, మనవరాలు నవిష్కతో కలిసి స్వామివారికి పూజలు చేశారు. వినాయకుడికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకున్నారు. ‘అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరి జీవితాలలో విఘ్నాలు తొలగి విజయాలు, సుఖ సంతోషాలు కలిగేలా ఆ విఘ్నేశ్వరుడు సదా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను’ అని విషెస్ చేశారు. కాగా ఈ వీడియోలో పూజారి మనవరాలు నవిష్కతో మంత్రాలు చెప్పిస్తుంటే చిరు చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. నవిష్క మంత్రాలు చెప్పడం పూర్తయిపోగానే గట్టిగా చప్పట్లు కొడుతూ మనవరాలిని ముద్దు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us