Ravi Teja’s Khiladi: సోషల్ మీడియాను ఊపేస్తున్న మాస్ మ‌హారాజా `అట్టా సూడ‌కే..` సాంగ్..

|

Jan 01, 2022 | 4:14 PM

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేష‌న్ లో రాబోతోన్న యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఖిలాడీ. ఈ చిత్రాన్నిసత్య నారాయణ కోనేరు నిర్మిస్తున్నారు.

Ravi Tejas Khiladi: సోషల్ మీడియాను ఊపేస్తున్న మాస్ మ‌హారాజా `అట్టా సూడ‌కే..` సాంగ్..
Ravi Teja
Follow us on

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేష‌న్ లో రాబోతోన్న యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఖిలాడీ. ఈ చిత్రాన్నిసత్య నారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.ప్ర‌స్తుతం ఈ మూవీ ప్రొడ‌క్షన్ చివ‌రిద‌శ‌లో ఉంది. ఈ మూవీ మ్యూజిక్ ప్రమోష‌న్స్‌లో భాగంగా విడుద‌ల చేసిన రెండు పాట‌ల‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా మూడవ‌పాట‌ “అట్టా సూడకే మత్తెక్కుతాంది ఈడుకే.. ఒంట్లో వేడికే పిచ్చెక్కుతాంది నాడికేఅంటూ సాగే పాటను విడుద‌ల‌చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పెప్పీ డ్యాన్స్ నంబర్ కు ట్యూన్ కంపోజ్ చేయ‌డంతో పాటు సింగర్ సమీరా భరద్వాజ్ తో కలిసి స్వయంగా ఆలపించారు. దీనికి లిరిసిస్ట్ శ్రీమణి మాస్ ఆడియన్స్ కి నచ్చేలా సాహిత్యం రాశారు.

‘అట్టా సూడకే’ పాటలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రవితేజ – మీనాక్షి చౌదరీ ఎనర్జిటిక్ మాస్ స్టెప్పుల‌తో అదరగొట్టారు. ఇక ఈ పాటు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ పాట విడుదలైన 24 గంటల్లో మిలియన్ కొద్దివ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక నిర్మాత‌లు ముందుగా ప్రకటించినట్టుగానే ఖిలాడీ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లోకి రానుంది. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ రెండు భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన రెండు పాటలు ఇప్పటికే విడుదల కాగా.. విశేషమైన స్పందన లభించింది.ఈ సినిమాలో అర్జున్, ఉన్ని ముకుందన్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్‏తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..

Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!

Telangana – Theater: ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ ప్రకటన..

Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..