Khiladi Movie : క్రాక్ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ట్రాక్ .లోకి వచ్చిన మాస్ రాజా అదే స్పీడ్ తో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. క్రాక్ సినిమా తర్వాత ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండనుందని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ , పాటలు, అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా రెండు విభిన్నమైన పాత్రల్లో రవితేజ నటిస్తున్నారు. ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ కరోనా కారణంగా.. షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు రిలీజ్ కూడా వాయిదా పడుతూ వచ్చింది. చివరకుసినిమాను ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రకటించారు.
ఈ క్రమంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. తాజాగా ఖిలాడి సినిమానుంచి ,మరో మాస్ మాసాల సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. దాంతో ‘ఫుల్ కిక్కు’ అంటూ సాగే లిరికల్ వీడియోను ఈ నెల 26వ తేదీన రిలీజ్ చేయనున్నారు. క్రాక్ ఇచ్చిన సక్సెస్ ను ఖిలాడితో కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు రవితేజ. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ నెల 26న రానున్న ‘ఫుల్ కిక్కు’ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్తున్నారు చిత్రయూనిట్. ఉదయం 10:08 నిమిషాలకు ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, సాగర్ ఆలపించాడు. చూస్తుంటే రవితేజ ఎనర్జీకి తగినట్టుగా ఈ పాట మంచి జోరుగా సాగనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటిస్తున్నారు. వెన్నెల కిశోర్ .. మురళీశర్మ .. అనసూయ ముఖ్యమైన పాత్రల్లో ఆకట్టుకోనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :