వివాహ బంధంతో ఒక్కటైన మంచు మనోజ్, మౌనిక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోదరి మంచు లక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల ఆలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తన నాలుగేళ్ల ప్రేమ ఫలించి.. భూమా మౌనికా రెడ్డితో వివాహం జరిగినందుకు హ్యాపీగా ఉన్నానని మంచు మనోజ్ అన్నారు. 12 ఏళ్ల నుంచి మౌనిక తనకు తెలుసని చెప్పారు. నాలుగేళ్ల క్రితం తాను వేరే ట్రామాలో ఉన్నప్పుడు తనే అండగా నిలిచింది. అలా, మరింత చేరువయినట్లు తెలిపారు. ఎన్నో వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ ధైర్యంగా నిలబడ్డామని మనోజ్ పేర్కొన్నారు. మౌనికతో తన పెళ్లి దేవుడి ఆశీస్సులతోనే జరిగిందని.. బాబు తన జీవితంలోకి రావడం కూడా అలానే అన్నారు మనోజ్. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చాడని పేర్కొన్నారు.
ఐతే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తనకు లేదన్నారు. ప్రజాసేవ చేయాలనే కోరిక మాత్రమే ఉందనీ, మౌనిక రెడ్డి రాజకీయాల్లోకి రావాలనుకుంటే తన సపోర్ట్ ఉంటుందన్నారు. ప్రజా సేవ చేయాలనే ఆలోచనే తమ ఇద్దరిని కలిపిందన్నారు మనోజ్. వాట్ ద ఫిష్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభిస్తానని మనోజ్ తెలిపాడు.
Newly married Couple, Hero @HeroManoj1 & @BhumaMounika visited Tirumala Tirupati Devasthanam along with @LakshmiManchu & Family. ❤️#manchumanoj #BhumaMounikaReddy #LakshmiManchu pic.twitter.com/PjWWXaY2Us
— Rainbow Media (@RainbowMedia_) March 6, 2023
ఇక ఇటు మంచు మనోజ్‌కీ, అటు భూమా మౌనికా రెడ్డికీ గతంలో వేర్వేరుగా వివాహాలు జరిగాయి. అయితే వారి జీవిత భాగస్వాముల దగ్గర నుంచి ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఎప్పటి నుంచో ఈ రెండు కుటుంబాలకీ మధ్య స్నేహబంధం ఉంది. భూమా దంపతుల మరణానంతరం వీరి బంధం మరింత బలపడింది. తరచూ మంచు మనోజ్ భూమా కుటుంబంలోని కీలక సందర్భాల్లో కనిపిస్తూ ఉండేవారు. వీరి మధ్య బంధం బలమైనదన్న విషయం అనేక సందర్భాల్లో వ్యక్తం అయ్యింది. ఇప్పుడు అది శాశ్వత బంధంగా మారింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..