Manchu Lakshmi: దేవర ‘చుట్ట మల్లే’ సాంగ్‌కు మంచు లక్ష్మి స్టెప్పులు.. వీడియో చూడండి

|

Oct 02, 2024 | 1:59 PM

సినిమాలతో పాటు పలు టీవీ షోల్లోనూ మెరిసిన మంచు వారమ్మాయి గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి అప్‌డేట్స్‌ను షేర్ చేస్తుంటుందామె.

Manchu Lakshmi: దేవర చుట్ట మల్లే సాంగ్‌కు మంచు లక్ష్మి స్టెప్పులు.. వీడియో చూడండి
Manchu Lakshmi
Follow us on

 

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మి. నటిగా, సింగర్‌గా, నిర్మాతగా, యాంకర్‌గా మల్టీ ట్యాలెంటెడ్ వుమన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు పలు టీవీ షోల్లోనూ మెరిసిన మంచు వారమ్మాయి గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి అప్‌డేట్స్‌ను షేర్ చేస్తుంటుందామె. అలాగే తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. అలా తాజాగా మంచు లక్ష్మీ షేర్ చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. ఇందులో పాటలు కూడా చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ముఖ్యంగా చుట్ట మల్లే సాంగ్ అయితే అభిమానులకు ఓ రేంజ్ లో కిక్ ఇచ్చింది. ఎన్టీఆర్ స్టెప్పులు, జాన్వీ అందాలు పాటకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఈ కారణంగానే చుట్ట మల్లే సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొడుతోంది.

ఇవి కూడా చదవండి

ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చుట్టమల్లే సాంగ్ నే వినిపిస్తోంది. పలువురు ప్రముఖులతో పాటు నెటిజన్లు ఈ పాటను రీక్రియేట చేస్తూ రీల్స్ చేస్తున్నారు. అలా తాజాగా మంచు లక్ష్మీ కూడ దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్ కు కాలు కదిపింది. బ్లాక్ శారీ ధరించి ఉత్సాహంగా స్టెప్పులేసింది. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘సూపర్ డ్యాన్స్ మేడమ్’ అని అంటూ కొందరు కామెంట్స్ చేస్తే.. మరికొందరు మాత్రం నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

మంచు లక్ష్మీ డ్యాన్స్ వీడియో ఇదిగో..

మంచు మనోజ్ కూతురి బారసాల ఫంక్షన్ లో మంచు లక్ష్మి… వీడియో

 

కూతురు, తల్లితో మంచు లక్ష్మి…

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.