
గుంటూరు కారం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. దీంతో ఆయన అభిమానులు మహేష్ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు మహేష్. గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఇందులో కథానాయికగా చేస్తోంది. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే విలన్ పాత్రలో కనిపించనున్నారు. . ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం. అక్టోబర్ ఎండింగ్ కి మెయిన్ షూటింగ్ మొత్తం పూర్తయిపోతుందని తెలుస్తుంది. 2027 ఏప్రిల్ లో వారణాసి సినిమాను రిలీజ్ చేస్తామని ఇదివరకే దర్శక నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మధ్యన స్టార్ హీరోలకు సైతం బాడీ డబుల్స్ ఉంటున్నారు. కష్టమైన యాక్షన్ సీక్వెన్స్ కోసం వీరిని వాడుతారని తెలసిఇందే. చాలా మంది హీరోలు స్వయంగా యాక్షన్ సీక్వెన్స్ లో నటించడం, గాయాల పాలు కావడం, సినిమా షూటింగులు లేటవుతుండడంతో కొన్ని సీన్స్ లో డూప్ లను వాడక తప్పడం లేదు. అలా తాజాగా వారణాసి సినిమాలో మహేష్ బాబు డూప్ ఇతనే అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
జక్కన్న వారణాసి సినిమాలో మహేష్ బాబుకి బాడీ డబల్ గా నటిస్తున్న ఇతని రోషన్ బొగాటి (అలియాస్) బాల్. ముంబై లో పుట్టి పెరిగిన తను మోడల్, నటుడు కూడా. మిస్టర్ ఇండియా టైటిల్ కూడా సాధించాడు. బాలీవుడ్ లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. తెలుగులో కూడా పాడేరు 12వ మైలు, యమునా నది, పెన్ డ్రైవ్ అనే సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు మౌంటెన్ డ్యూ యాడ్ లో కూడా మహేష్ కి డూప్ గా నటించింది కూడా ఇతనే. ఇప్పుడు మళ్లీ వారణాసి సినిమాలో మహేష్ బాబు కి డూప్ గా నటిస్తున్నాడు రోషన్ బొగాటి. ఈ క్రమంలోనే వారణాసి షూటింగ్ సెట్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, ఫైట్ మాస్టర్.. పలువురితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు బొగాటి. అంతేకాదు ఈ ఫొటలకు #stunts #Bodydouble అనే హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.
అత్యాధునిక, భారీ విజువల్స్‌కు పేరుగాంచిన రాజమౌళి వారణాసి చిత్రాన్ని సుమారు రూ. 1,300 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇది భారతదేశంలో రెండో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిలుస్తుందని అంటున్నారు నిపుణులు. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి