
శ్రీశ్రీ.. అభ్యుదయ సాహిత్యానికి ఆయన గ్రంథాలయం అని చెప్పుకొవచ్చు. ఎన్నో రచనలు.. మరెన్నో కవిత్వాలు.. ఈతరం రచయితలకు, దర్శక నిర్మాతలకు స్పూర్తిగా నిలిచాయి. విప్లవ భావాలు కలిగిన ఆయన రచనలు ప్రజలను చైతన్య పరిచాయి. శ్రీశ్రీ రాసిన అక్షరాలు పాఠకులను తట్టిలేపాయి. కేవలం రచనలు, కవిత్వాలు మాత్రమే కాదు.. సినిమాల్లో పాటలు సైతం రాశారు. శ్రీశ్రీ అసలు పేరు శ్రీరంగం శ్రీనివాస రావు. 191 ఏప్రిల్ 30న విశాఖపట్నంలో జన్మించారు. సినిమా పాటలకు సాహిత్యం అందించినందుకు గానూ జాతీయ అవార్డు అందుకున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా అల్లూరి సీతారామరాజు. 1974లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఆ చిత్రంలో ఆ సమయంలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో సీతారామరాజు పాత్రలో కృష్ణ నటన గురించి చెప్పక్కర్లేదు.
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak: అందరు హీరోలతో చేశా.. కానీ నాగార్జునతో సినిమా ఎందుకు చేయాలేదంటే.. అసలు విషయం చెప్పిన వివి వినాయక్..
ఈ సినిమాలో తెలుగు వీర లేవరా అనే పాటను శ్రీశ్రీ రాశారు. ఈ పాటకు జాతీయ అవార్డ్ అందుకున్నారు. కృష్ణ నటించిన ఎన్నో సినిమాలకు శ్రీశ్రీ సాహిత్యం అందించారు. అందుకే కృష్ణతో శ్రీశ్రీకి ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. కురుక్షేత్రం సినిమాలో కురుక్షేత్రం ఇది ధర్మక్షేత్రం అంటూ అద్భుతమైన కురుపాండవ సైన్యాన్ని వర్ణిస్తూ శ్రీశ్రీ పాట రాశారు. అలాగే తెలుగులో డాక్టర్ చక్రవర్తి సినిమాలో మనసున మనసై..బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము..అదే స్వర్గము.. అనే పాటను రాశారు. భూమి కోసం సినిమాలో ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా అంటూ పాట రాశారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood: కోటి 40 లక్షలు పెట్టి సినిమా తీశా.. అప్పు తీర్చడానికి 6 ఏళ్లు కప్పులు కడిగాను.. టాలీవుడ్ నటుడు..
ఇదెలా ఉంటే.. గతంలో శ్రీశ్రీ మాట్లాడుతూ.. సూపర్ స్టార్ కృష్ణ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “నేను ఒక అక్షరం రాసిన దానికి కూడా విలువ కట్టి పారితోషికం ఇచ్చిన ఏకైక వ్యక్తి కృష్ణ” అంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రకటన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Srikanth : అతడిని నమ్మి చాలా డబ్బు పోగొట్టుకున్నాను.. అందుకు కారణం ఆ ఒక్కటే.. శ్రీకాంత్..
Krishna
ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma: ఆ మహా మనిషికి తలవంచి పాదాభివందనం చేస్తా.. ఆయన గొప్ప వ్యక్తి.. రామ్ గోపాల్ వర్మ..