Peddi Movie : యూట్యూ‏బ్‏లో పెద్ది స్పెషల్ సాంగ్ ప్రోమో సంచలనం.. రాయడానికే 50 రోజులు పట్టింది.. అసలు విషయం చెప్పిన అనంత శ్రీరామ్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్..

Peddi Movie : యూట్యూ‏బ్‏లో పెద్ది స్పెషల్ సాంగ్ ప్రోమో సంచలనం.. రాయడానికే 50 రోజులు పట్టింది.. అసలు విషయం చెప్పిన అనంత శ్రీరామ్..
Anantha Sriram, Peddi Song

Updated on: May 22, 2026 | 6:06 PM

పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న సెకండ్ మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. మరోవైపు పెద్ది మూవీ సాంగ్స్ యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. జూన్ 4న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. హల్లల్లో హల్లల్లో అంటూ సాగే ఈ పాట ప్రోమో చూస్తుంటే మెగా ఫ్యాన్స్‌ను ఊపేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో రామ్ చరణ్ సరసన శృతిహాసన్, జాన్వీ కపూర్ అదిరిపోయే స్టెప్పులు చూస్తుంటే ఈ పాట వేరేలెవల్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Rajamouli : ఆ హీరో చాలా గొప్పోడు.. సినిమా కోసం తన జీవితాన్నే ఇచ్చేశాడు.. రాజమౌళి కామెంట్స్..

ఈ క్రమంలోనే ఈ పాటకు సాహిత్యం అందించిన గేయ రచయిత అనంత శ్రీరామ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “తెలుగులో నేను ఏఆర్ రెహమాన్ కు దాదాపు 30 పాటలు రాశాను. ప్రతి పాట కొత్తగానే అందించాను. ప్రయోగాలకు ఆయన ఎప్పుడూ పెద్దపీట వేస్తారు. పెద్దిలో స్పెషల్ సాంగ్ అదిరిపోతుంది. ఆ పాట రాయడానికి నాకు దాదాపు 50 రోజుల సమయం పట్టింది. రెహమాన్ బాణీల్లో ఇప్పటివరకు వచ్చినదాని కంటే కొత్త తరహా ప్రయోగం చేశారు. స్పెషల్ సాంగ్ కు ఇలాంటి బాణీలు ఇవ్వొచ్చా.. ? అని మేము ఆశ్చర్యపోయాం. ఆ ట్యూన్ వింటూనే 5 రోజులు గడిపేశాం. తర్వాత లిరిక్స్ కూడా ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లుగా రాశాను. ఇక పెద్దిలో రైరా రారా పాట విని చిరంజీవి ఫోన్ చేశారు. నా జీవితాన్ని నేను చూసుకున్నట్లు ఉంది.. ఫిలాసఫీని ఇప్పటి కాలానికి తగినట్లుగా అందించావు అని చిరంజీవి చెప్పడం జీవితంలో మర్చిపోలేను ” అంటూ చెప్పుకొచ్చారు అనంత శ్రీరామ్.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ వాన పాట వల్లే హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ నటి.

పెద్ది నుంచి ఫుల్ స్పెషల్ సాంగ్ ను మే 23న అంటే శనివారం విడుదల చేయనున్నారు. భోపాల్ లో జరిగే గ్రాండ్ ఈవెంట్ లో ఈ పాటను రిలీజ్ చేస్తారు. ఏఆర్‌ రెహమాన్‌తో లైవ్‌ కాన్సర్ట్‌ ఏర్పాటు చేసి అందులో ఈ పాటను పూర్తిగా రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం పెద్ది స్పెషల్ సాంగ్ ప్రోమో మాత్రం యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..

పెద్ది స్పెషల్ సాంగ్ ప్రోమో..

ఎక్కువ మంది చదివినవి :  Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..

Follow Us