Lavanya Tripathi : ఆనంద క్షణాలను అసహ్యంగా మార్చకండి.. లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ కౌంటర్..

తెలుగులో తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే మెగా హీరో వరణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు వాయువ్ అనే అబ్బాయి జన్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న లావణ్య..ఇప్పుడు వార్తలలో నిలిచింది. అందుకు కారణం ఇటీవల ఆమె చేసిన ట్వీట్.

Lavanya Tripathi : ఆనంద క్షణాలను అసహ్యంగా మార్చకండి.. లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ కౌంటర్..
Lavanya Tripathi

Updated on: Feb 04, 2026 | 1:53 PM

మెగా ఫ్యామిలీలో ఆనందం రెట్టింపు అయ్యింది. క్లింకార రాకతో తండ్రిగా ప్రమోషన్ పొందిన రామ్ చరణ్.. ఇప్పుడు మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య ఉపాసన ఇటీవల పండంటి కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అపోలో ఆసుపత్రిలో బాబు, పాపకు జన్మనిచ్చింది. దీంతో మెగాస్టార్ చిరంజీవికి, చరణ్ దంపతులకు సినీప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇదిలా ఉంటే.. గతంలో చిరు చేసిన కామెంట్స్ మరోసారి షేర్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు పలువురు నెటిజన్స్. అప్పట్లో మెగా వారసుడి అంటూ మాట్లాడిన మాటలపై ఇష్టానుసారంగా ట్రోల్స్ చేస్తున్నారు. వీటిపై మెగా కోడలు లావణ్య త్రిపాఠి గట్టిగానే స్పందించింది. చిరు గురించి ట్రోల్ చేసేవారికి ఇచ్చిపడేసింది.

ఎక్కువ మంది చదివినవి: Jabardasth: పెద్ద హీరో సినిమాలో ఛాన్స్.. మొహం మీదే వద్దని చెప్పా.. జబర్దస్త్ బ్యూటీ..

మెగా కుటుంబంలో ప్రస్తుత జనరేషన్ లో దాదాపు అందరూ అమ్మాయిలే ఉన్నారు. ఈ విషయం గురించి గతంలో ఓ మూవీ ప్రమోషన్లో చిరు మాట్లాడుతూ.. మెగా లెగసీని ముందుకు తీసుకెళ్లే వారసుడి కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. ఇప్పుడు అవే మాటలను కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఆడపిల్లలు, మహిళలను చిరంజీవి చులకనగా చూస్తున్నారని విమర్శలు వచ్చాయి. దీనిపై లావణ్య త్రిపాఠి స్పందిస్తూ.. ఇలాంటి చీప్ కామెంట్స్ ఊహించలేదని.. ఆనంద క్షణాలను తమ కామెంట్లతో అసహ్యంగా మార్చకండి అంటూ రాసుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి: Uday Kiran : ఆ చెత్త సినిమాలే నా కెరీర్‏ను నాశనం చేశాయి.. ఉదయ్ కిరణ్ ఎమోషనల్ కామెంట్స్..

“సాధారణంగా ఇలాంటి ట్వీట్లను అస్సలు పట్టించుకోకుండా వదిలేస్తాను. కానీ ఈసారి స్పందించక తప్పడం లేదు. ఓ సంతోషకరమైన క్షణాన్ని ఇలా విషపూరితంగా మార్చడం చాలా నీచమైన ఆలోచన. చిరంజీవి కుటుంబంలోని మహిళను, ముఖ్యంగా తన మనవరాళ్లను ఎంతో ప్రేమగా, గౌరవంగా చూసుకుంటారో .. విమర్శలు చేసేవారికి తెలియదు. చిరంజీవి తన కుటుంబానికి ఇచ్చే విలువ చాలా మందికి సాధ్యం కాదు. ఆయన చేసే పనుల్లో 1 శాతం కూడా చేయలేని వాళ్లు.. ఆయన వ్యక్తిత్వం పై కామెంట్స్ చేయడం సరికాదు ” అంటూ రాసుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి: Cinema : అర్థరాత్రి హోటల్లో అరుపులు.. 24 ఏళ్లుగా ఆ హీ‏రోయిన్‏ను భయపెడుతున్న సినిమా.. ఇప్పటికీ..

ఎక్కువ మంది చదివినవి: Dhandoraa Movie : దండోరా సినిమాలో బింధు మాధవి పాత్రలో ఆ హీరోయిన్ నటించాల్సింది.. కానీ.. డైరెక్టర్