Rashmika Mandanna: రష్మిక మీదకు ఎగబడ్డ ఫ్యాన్స్.. బాడీ గార్డ్‌లా మారిన బాలీవుడ్ బ్యూటీ

సినిమా స్టార్లు కనిపిస్తే ఫ్యాన్స్‌ ఎగబడి పోతారు. వారికి షేక్‌హ్యాండ్‌ ఇవ్వడానికి, తాకడానికి ప్రయత్నిస్తారు. ఇంకొందరైతే అసభ్య చేష్టలు చేస్తుంటారు. ఇలాంటి సందర్భాలు ఇదివరకే చాలా జరిగాయి. అభిమానుల తీరుపై విమర్శలు కూడా వచ్చాయి. అయినా, ఫ్యాన్స్‌ పద్ధతి మారడం లేదు.

Rashmika Mandanna: రష్మిక మీదకు ఎగబడ్డ ఫ్యాన్స్.. బాడీ గార్డ్‌లా మారిన బాలీవుడ్ బ్యూటీ
Rashmika, Kriti Sanon

Updated on: Jun 14, 2026 | 9:27 AM

ఒక హీరోయిన్‌ మరో హీరోయిన్‌కు ఎస్కార్ట్‌ ఇవ్వడం ఎప్పుడైనా చూశారా.? పుణెలో ఇదే జరిగింది. రష్మిక మందన్నకు కృతి సనన్‌ రక్షణగా నిలిచారు. అభిమానుల తాకిడిని తట్టుకునేందుకు రష్మికకు పెద్దక్కలా తోడుగా నిలిచారు. పుణెలో ఈ సీన్‌ కనిపించింది. కాక్‌టెయిల్‌-2 సినిమా ప్రమోషన్ ఈవెంట్‌కు షాహిద్‌ కపూర్‌తోపాటు ఈ ఇద్దరు హీరోయిన్లు వచ్చారు. సినిమా స్టార్స్‌కు షేక్‌హ్యాండ్‌ ఇవ్వడానికి, ఫ్యాన్స్‌ పోటీపడ్డారు. షేక్‌హ్యాండ్‌ పేరుతో రష్మికను తాకడానికి ఓ వ్యక్తి ఎగబడిన దృశ్యాలు రికార్డయ్యాయి.

ఇది కూడా చదవండి : Jabardasth Vinod: జబర్దస్త్ లేకపోతే ఆ పని చేసేవాడిని.. అసలు విషయం చెప్పిన లేడీ గెటప్ వినోద్

పుణెలోని ఒక హోటల్‌లో నిర్వహించిన సినిమా ప్రమోషనల్‌ ఈవెంట్‌కు అభిమానులు ఇలా పోటెత్తారు. వీరిని అదుపు చేయడం కూడా కష్టమైంది. దీంతో ఈవెంట్‌ను షెడ్యూల్‌కన్నా ముందే ముగించారు. ఈవెంట్‌ నుంచి స్టార్ట్స్‌ బయటకు వస్తుండగా అభిమానులు పోటెత్తారు. సెక్యూరిటీ ఏర్పాట్లు అక్కడ పనిచేయలేదు. ఈ వేలంవెర్రికి స్టార్స్‌ ఇబ్బంది పడ్డారు. ఈ సమయంలోనే కృతి సనన్‌ చొరవ తీసుకుని, రష్మికకు ఇబ్బంది లేకుండా ఆమె చుట్టూ చేతులేసి పట్టుకుని ఇలా బయటకు వచ్చారు. కృతిసనన్‌ ఇలా రష్మికను జాగ్రత్తగా బయటకు తీసుకురావడంపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇది కూడా చదవండి : ఇప్పుడున్న హీరోల్లో అతనొక్కడే నన్ను ఆంటీ అని పిలుస్తాడు.. జయసుధ ఆసక్తికర కామెంట్స్

ఈ మొత్తం సీన్‌- ఫ్యాన్స్‌ పైత్యాన్ని మరోసారి చాటిచెప్పింది. స్టార్స్‌ కనిపిస్తే చాలు, కనీస మర్యాద లేకుండా, వేలం వెర్రిగా మీద పడేలా దూసుకొచ్చే అభిమానుల తీరు చర్చనీయాంశమైంది. అభిమానం పేరుతో సినిమా స్టార్లను ఇలా ఇబ్బంది పెట్టడంపై పలు సందర్భాల్లో విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇలాంటి అసభ్యకరమైన చేష్టలకు మాత్రం ఫుల్‌స్టాప్‌ పడలం లేదు.

ఇది కూడా చదవండి : అప్పుడు నా సినిమాలో నటించాడు.. ఇప్పుడు స్టార్ హీరో.. అతను ఎంత మారిపోయాడంటే

ఫ్యాన్స్ రష్మికపై ఎడబడ్డ వీడియో ఇక్కడ చూడండి.. 

 

Follow Us