Krithi Shetty Birthday : సొట్ట బుగ్గలతో స్మైల్ ఇచ్చిన సుందరి… రామ్ పోతినేని సినిమా నుంచి అందాల కృతి బర్త్ డే పోస్టర్..

|

Sep 21, 2021 | 11:18 AM

ఉప్పెన సినిమాతో ఎగసిన అందం కృతి శెట్టి. ఈ మంగుళూరు బ్యూటీ మొదటి సినిమాతోనే మాయ చేసింది. సుకుమార్ శిష్యుడు బుచ్చుబాబు సన దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది కృతి..

Krithi Shetty Birthday : సొట్ట బుగ్గలతో స్మైల్ ఇచ్చిన సుందరి... రామ్ పోతినేని సినిమా నుంచి అందాల కృతి బర్త్ డే పోస్టర్..
Kruthi
Follow us on

Krithi Shetty: ఉప్పెన సినిమాతో ఎగసిన అందం కృతి శెట్టి. ఈ మంగుళూరు బ్యూటీ మొదటి సినిమాతోనే మాయ చేసింది. సుకుమార్ శిష్యుడు బుచ్చుబాబు సన దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది కృతి. మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు. ఇక ఉప్పెన సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ కృతి. ఉప్పెన సినిమా నుంచి కృతి పోస్టర్ విడుదలైన వెంటనే ఈ చిన్నదానికోసం గూగుల్ ని గాలించేశారు అభిమానులు. ఉప్పెన సినిమాతో రాత్రికి రాత్రే క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇక మొదటి సినిమాతోనే మెప్పించిన ఈ మంగుళూరు ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

ప్రస్తుతం ఈ చిన్నది.. నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తుంది కృతిశెట్టి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది ఈ చిన్నది. ఈ సినిమాకు తమిళ్ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. నేడు కృతిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా సినిమానుంచి అందమైన కృతి పోస్టర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. అలా వెనక్కితిరిగి ఓర కంట చూస్తున్న ఓ చిరుమందహాసం విసిరింది కృతి. ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. సొట్ట బుగ్గలతో ఆమె ఇచ్చిన స్మైల్ కుర్రాళ్ళ గుండెల్లో బాణాల గుచ్చుకుంటున్నాయి. ఇక నితిన్ జోడీగా ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమాను కూడా చేస్తోంది. ఇదే సమయంలో పట్టాలెక్కిన ‘బంగార్రాజు’ సినిమాలో ఆమె చైతూ జోడీగా కనిపించనుంది. అలాగే సుధీర్ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే మూవీ చేస్తోంది.

Ram 19

Kruthi Shettyమరిన్ని ఇక్కడ చదవండి : 

Nandamuri Balarkishna: మరోసారి మంచి మనసు చాటుకున్న బాలకృష్ణ.. చిన్నారి క్యాన్సర్ పేషేంట్‌కు చికిత్స కోసం ఆర్ధిక సాయం

Nagarjuna’s Ghost Movie: నాగార్జున సినిమాకు నో చెప్పిన కాజల్.. చందమామ ప్లేస్‌ను రీప్లేస్ చేసేది ఆమేనా..

Bigg Boss 5 Telugu: ఆమె సింగిల్.. ఏమైనా చెయ్యొచ్చు అన్న ప్రియా.. రెచ్చిపోయిన రవి.. సీరియస్ అయిన సన్నీ..