
ఏఐ (ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్) వచ్చాక ప్రపంచ స్వరూపమే మారిపోయింది. కొందరు ఈ టెక్నాలజీని మంచి పనులకు ఉపయోగిస్తుంటే.. మరికొందరు చెడ్డ పనులకు ఈ టెక్నాలజీని వినియోగిస్తూ దుర్వినియోగ పరుస్తున్నారు. ఇదే క్రమంలో మరికొందరు తమ అభిమాన హీరోలను తమకు నచ్చిన విధంగా చూపించేందుకు ఈ ఏఐని వినియోగిస్తున్నారు. ఇటీవల కొందరు సినీ అభిమానులు ఏఐ సాయంతో తమ అభిమాన నటులకు సంబంధించిన ప్రత్యేక వీడియోలను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు మన మధ్య లేని హీరోలను కూడా సృజనాత్మకంగా చూపిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలా తాజాగా దివంగత నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ, ఆయన కుమారుడు మహేశ్‌బాబులకు సంబంధించిన ఓ ఏఐ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇందులో తండ్రీ కొడుకులను ఒకే ఫ్రేమ్‌లో యాక్షన్ సన్నివేశాల్లో చూపించారు. అంతేకాదు ఇద్దరూ కలిసి ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహిస్తూ ఒక అభిమాని ఈ వీడియోను రూపొందించాడు. ఏఐ సాయంతో రూపొందించిన ఈ వీడియోలో మహేశ్‌బాబు, కృష్ణ యాక్షన్ సన్నివేశాల్లో కనిపించడంతో అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.
కాగా సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన పలు సినిమాల్లో మహేష్ బాబు ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ముగ్గురు కొడుకులు, గూడఛారి 117, కొడుకు దిద్దిన కాపురం, శంఖారావం తదితర సినిమాల్లో తండ్రీ కొడుకులు కలిసి నటించారు. అలాగే మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన రాజకుమారుడు, వంశీ సినిమాలలో కృష్ణ కీలక పాత్రలు పోషించారు. అయితే వంశీ సినిమా తర్వాత మరే సినిమాలోనూ వీరిని కలిసే చూసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఏఐ రూపంలో మళ్లీ ఆ అవకాశం కల్గింది.
Evadu chesado kani 🥵🤙 dinemma aa high 💥🔥 #MaheshBabu #Krishna 😎 pic.twitter.com/lpn9ihmJvT
— Victor (@victormodeon) September 28, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.