Actor : ఏందీ బ్రో నువ్వు.. సినిమా అంటే ఇంత పిచ్చా.. ఏకంగా సముద్రంలోనే జిమ్ చేస్తున్నావ్..

సాధారణంగా సినిమా కోసం హీరోస్ ఎంతటి రిస్క్ అయినా చేస్తుంటారు. తమ ప్రాణాలను లెక్క చేయకుండా అనేక స్టంట్స్ చేస్తూ తీవ్రంగా గాయపడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు షూటింగ్స్ లో గాయపడి.. ఇప్పటికీ ఇబ్బందిపడుతుంటారు. అయితే ఈ హీరో తన సినిమా సీన్స్ కోసం సముద్రంలోనే రిస్క్ చేస్తున్న ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ అతడు ఎవరో తెలుసుకుందామా.

Actor : ఏందీ బ్రో నువ్వు.. సినిమా అంటే ఇంత పిచ్చా.. ఏకంగా సముద్రంలోనే జిమ్ చేస్తున్నావ్..
Soori

Updated on: Feb 07, 2026 | 5:29 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు తోపు కమెడియన్. కానీ ఇప్పుడు అతడే టాప్ హీరో. అప్పట్లో తనదైన కామెడీతో అలరించిన అతడు.. ఇప్పుడు హీరోగా అడియన్స్ హృదయాలు దోచుకుంటున్నాడు. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తన సినిమా కోసం ఏకంగా సముద్రంలోనే రిస్క్ చేస్తున్నాడు. అతడు ఎవరో తెలుసా.. ? అతడు మరెవరో కాదండి కోలీవుడ్ హీరో సూరి. అప్పట్లో పాపులర్ కమెడియన్. ప్రస్తుతం వన్ ఆఫ్ ది స్టార్ హీరో. ఇప్పటివరకు పుల చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న అతడు.. ఇప్పుడు మందాడి చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ రామనాథపురం జిల్లాలోని తొండి ప్రాంతంలో ఆరు నెలలుగా జరుగుతోంది. ఈ చిత్రంలో నటుడు సూరి ఒక మత్స్యకారుడిగా కనిపిస్తారని టాక్.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

అలాగే రామనాథపురం జిల్లాలోని మత్స్యకారులకు వీరోచిత క్రీడ అయిన సెయిల్ బోట్ రేస్ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి దర్శకుడు మతిమారన్ పుగళేంథి దర్శకత్వం వహించారు. ఎల్రాడ్ కుమార్ కు చెందిన R.S. ఇన్ఫో కంపెనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహిమా నంబియార్ మహిళా కథానాయికగా నటిస్తోంది. సత్యరాజ్ వంటి అనేక మంది నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొన్ని రోజులుగా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సూరి తన పాత్రపై మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు.

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..

అయితే తాజాగా ఈ సినిమా కోసం సూరి చేస్తున్న రిస్క్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సముద్రంలో పడవపై వ్యాయామం చేస్తున్న రీల్స్ వీడియోను పోస్ట్ చేశాడు సూరి. ఎలాంటి భయం లేకుండా సముద్రం మధ్యలో పడవకు ఉండే కర్రల సాయంతో కఠినమైన వ్యాయమాలు చేస్తూ కనిపిస్తున్నాడు. దీంతో సూరి డెడికేషన్ లెవల్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.