Actress : 13 ఏళ్లుగా ఒక్క సినిమా చేయలేదు.. కానీ 4600 కోట్లకు మహారాణి.. ఆమె కోసం స్టార్ హీరోలే వెయిట్ చేశారు..

కొన్నేళ్ల క్రితం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. చిన్న వయసులోనే నటిగా తెరంగేట్రం చేసి తనదైన ముద్ర వేసింది. అప్పట్లో ఆమె యూత్ ఫేవరేట్ క్రష్. ఆమెతో సినిమా చేసేందుకు స్టార్స్ హీరోస్ సైతం ఆసక్తిగా ఎదురుచూసేవారు. కానీ మీకు తెలుసా.. ? దాదాపు 13 సంవత్సరాలుగా ఆమె ఒక్క సినిమా చేయలేదు. ఆమె భారతదేశంలో అత్యంత ధనిక నటి.

Actress : 13 ఏళ్లుగా ఒక్క సినిమా చేయలేదు.. కానీ 4600 కోట్లకు మహారాణి.. ఆమె కోసం స్టార్ హీరోలే వెయిట్ చేశారు..
Juhi Chawla

Updated on: Feb 06, 2026 | 10:28 AM

ఒకప్పుడు భారతీయ సినిమా ప్రపంచంలో ఆమె స్టార్ హీరోయిన్. వరుస సినిమాలతో ఇండస్రీలో అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకుంది. స్టార్ హీరోలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఆమె దాదాపు 7 సంవత్సరాలుగా ఓ సినిమాను థియేటర్లలో విడుదల చేయలేదు. అంతేకాదు.. 13 సంవత్సరాలుగా ఒక్క హిట్ మూవీ కూడా చేయలేదు. అయినప్పటికీ ఆమె భారతదేశంలో అత్యంత ధనిక నటి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ పేరు జూహి చావ్లా. 90’s యూత్ ఫేవరేట్ హీరోయిన్. 1986లో ధర్మేంద్ర నటించిన సుల్తానాథ్ చిత్రం ద్వారా నటిగా తెరంగేట్రం చేసింది. బాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. 1988లో ఆమిర్ ఖాన్ నటించిన ‘కియామత్ సే కియామత్ తక్’ చిత్రం జూహి చావ్లాకు గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత 1991లో రజినీకాంత్ నటించిన నాట్టుక్కు ఒరు నల్లవన్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. జూహీ చావ్లా ఎక్కువగా పంజాబీ, హిందీ, మలయాళం భాషలలో వరుస చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉండిపోయింది. దాదాపు 13 సంవత్సరాలుగా ఆమె ఒక్క హిట్ చిత్రాల్లోనూ నటించలేదు. పెళ్లి తర్వాత పలు చిత్రాల్లో అతిథి పాత్రలోనే నటించింది. ఆమె ఆస్తులు రూ.4600 కోట్లు ఉన్నట్లు సమాచారం.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

2024 – 2025 సంవత్సరానికి హురున్ రిచ్ లిస్ట్ నివేదిక ప్రకారం.. రూ.4600 కోట్లు సంపాదించినట్లు టాక్. ఆమెకు సినీరంగం నుంచి వచ్చే ఆదాయం తక్కువే. కానీ ఇప్పుడు ఆమెుక వ్యాపారమే సర్వస్వం. రియల్ ఎస్టేట్, క్రికెట్ జట్టులో అధికంగా పెట్టుబడి పెట్టారు. జూహి చావ్లా, షారుఖ్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సన్నిహితులు. ఇద్దరు కలిసి కోల్ కత్తా నైట్ రైడర్స్ లో పెట్టుబడులు పెట్టారు. ఆమె రూ.623 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మొత్తం విలువ రూ.9,139 కోట్లు అని సమాచారం.

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

అంతేకాదు.. షారుఖ్ ఖాన్ కు చెందిన రెడ్ చిల్లీస్ నిర్మాణ సంస్థలో జూహి చావ్లా సహ భాగస్వామి. సౌరాష్ట్ర సిమెంట్‌లో చావ్లాకు 0.07 శాతం వాటా కూడా ఉంది. ఆమెకు ముంబైలో రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. అలాగే ముంబై, గుజరాత్ లో పెద్ద బంగ్లాలు ఉన్నాయి. ఆమె వద్ద ఆస్టన్ మార్టిన్ రాపిడ్ (రూ. 3.3 కోట్లు), BMW 7-సిరీస్ (రూ. 1.8 కోట్లు), మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్ (రూ. 1.7 కోట్లు), జాగ్వార్ XJ (రూ. 1.2 కోట్లు), పోర్స్చే కయెన్ (రూ. 1.36–2 కోట్లు) వంటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

Juhi Chawla Films

 

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..