Tollywood : ఒక్క సినిమాతోనే స్టార్ డమ్.. 31 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య.. ఈ హీరో ఎందుకు చనిపోయాడో తెలుసా.. ?

సినీరంగంలో నటీనటులుగా గుర్తింపు రావడం అంత సులభం కాదు. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తిరిగేవాళ్లు చాలా మంది కనిపిస్తుంటారు. ఎంతో మంది తొలి సినిమాతోనే తామెంటో ప్రూవ్ చేసుకుని గొప్ప స్థాయికి ఎదిగారు. కానీ ఆ క్రేజ్ కాపాడుకోలేక కనిపించకుండా పోయినవాళ్లు ఉన్నారు. అందులో ప్రేమికుల రోజు సినిమా హీరో ఒకరు.

Tollywood : ఒక్క సినిమాతోనే స్టార్ డమ్.. 31 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య.. ఈ హీరో ఎందుకు చనిపోయాడో తెలుసా.. ?
Kunal Singh

Updated on: Aug 23, 2026 | 10:15 AM

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో నటీనటులుగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఒకటి రెండు చిత్రాలతోనే సక్సెస్ అయిన హీరోహీరోయిన్లు.. ఆ తర్వాత కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే చిన్న చిన్న పొరపాట్లతో జీవితాలకు ముగింపు పలికారు. అందులో కునాల్ సింగ్ ఒకరు. ఈ పేరు చెబితే ఈతరం ప్రేక్షకులు అస్సలు గుర్తుపట్టలేరు. కానీ ఒకప్పుడు యువతరానికి నచ్చిన హీరో. అతడు నటించిన తొలి చిత్రం కాదల్ దినం. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేమికుల రోజు పేరుతో రిలీజ్ చేయగా.. దక్షిణాదిలో భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో సోనాలి బింద్రే కథానాయికగా నటించగా.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. అప్పట్లో ఈ సినిమాలోని పాటలు కుర్రకారును కట్టిపడేశాయి. వాలు కనులదానా, ప్రేమ అనే పరీక్ష రాసి, దాండియా ఆటలు ఆడ వంటి పాటలు ఇప్పటికీ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతున్నాయి. పాటలతోపాటు సినిమా సైతం సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో మాములోడు కాదు.. నెంబర్ వన్ ఫ్రాడ్.. సీనియర్ నటుడు సురేష్..

కునాల్ కోసం అవకాశాలు క్యూ కట్టాయి. కానీ మొదటి సినిమా ఇచ్చిన విజయం తర్వాతి చిత్రాలు అందించలేకపోయాయి. హిట్ల కంటే ఎక్కువగా ప్లాపులే అందుకున్నాడు. దీంతో కొన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ కాకుండానే ఆగిపోయాయి. దీంతో మానసికంగా కుంగిపోయాడు. 2007లో చివరగా నంబనిన్ కాదలై అనే సినిమాలో నటించాడు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, అసిస్టెంట్ డైరెక్టర్ గా మారాడు. అయితే అదే సమయంలో నటి లావిణ పంకజ్ భాటియా అనే అమ్మాయితో సన్నిహితంగా ఉండేవాడని ప్రచారం జరిగింది. అప్పటికే అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కునాల్, పంకజ్ విషయం తెలియడంతో సంసారంలో గొడవలు మొదలయ్యాయి. దీంతో అతడి భార్య అతడిని వదిలేసి వెళ్లిపోయిందట.

ఎక్కువ మంది చదివినవి : Sowcar Janaki: షావుకారు జానకి మనవరాలు తెలుగులో పెద్ద హీరోయిన్.. చాలా ఫేమస్.. ఎవరో

2008 ఫిబ్రవరి 7న కునాల్ తన అపార్ట్మెంట్ లో ఉరేసుకుని చనిపోయాడు. ఇది జరగడానికి కొన్ని గంటల ముందు ఏదో సినిమా గురించి స్క్రిప్ట్ రైటర్, కాస్ట్యూమ్ డిజైనర్స్, నటి పంకజ్ తో తన ఇంట్లో ఇంట్లో చర్చలు జరిపాడట. కునాల్ ఆత్మహత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. కేవలం 31 ఏళ్ల వయసులోనే కునాల్ ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలిచివేసింది.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: రహస్య బావిలో మహిళ అరుపులు.. భయంతో వణికిపోవాల్సిందే.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ థ్రిల్లర్..

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్‏బాస్‏లోకి ఈశ్వర సాయి, మాధురి రాథోడ్.. ఆది రెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ?

Loading...
Unable to load recommendations.
Follow Us