సీరియల్‌లో తల్లి.. బయట మాత్రం భార్య.! ఎనిమిదేళ్ల చిన్నవాడిని పెళ్లాడిన ఈ నటి ఎవరంటే

సినిమాలకు, సీరియల్స్ కు మన దగ్గర విపరీత మైన క్రేజ్ ఉంది. సినిమాలకు సమానంగా సీరియల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. లాక్ డౌన్ తర్వాత సీరియల్స్ చూసే ఆడియన్స్ సంఖ్య భారీగా పెరిగిపోయింది. రకరకాల సీరియల్స్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి

సీరియల్‌లో తల్లి.. బయట మాత్రం భార్య.! ఎనిమిదేళ్ల చిన్నవాడిని పెళ్లాడిన ఈ నటి ఎవరంటే
Actress

Updated on: Aug 14, 2025 | 11:15 AM

సినిమా ఇండస్ట్రీలో లవ్ మ్యారేజ్ లు చాలా కామన్. తోటి హీరోలను పెళ్లి చేసుకున్న వారు చాలా మంది ఉంది. కొంతమంది హీరోయిన్స్ దర్శకులను పెళ్లి చేసుకున్నారు మరికొంతమంది నిర్మతలను పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ సీరియల్ బ్యూటీ మాత్రం చాలా డిఫరెంట్ ఆమె కూడా తన కో స్టార్ నే పెళ్లి చేసుకుంది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.. సీరియల్ లో తన కొడుకుగా నటించిన వ్యక్తినే.. బయట ప్రేమించి పెళ్లాడింది. అంతే కాదు ఆతను ఆమె కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడు. ఈ ఇద్దరి పెళ్లి పై చాలా విమర్శలు వచ్చాయి. నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ కూడా చేశారు. అంతే కాదు వీరి పెళ్ళికి వాళ్ల పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు. వీటితో పాటు ఊహించని ట్విస్ట్ మరొకటి ఏంటంటే.. ఈ ఇద్దరి మతాలు వేరు.. అమ్మాయి ముస్లిం , అబ్బాయి హిందూ.. ఇంతకూ ఈ నటి ఎవరు అనేది ఒక్కసారి చూద్దాం.!

Murali Sharma: ఇదేంది మావ..! ఈ హీరోయిన్ ఈయన భార్య.! అస్సలు ఊహించలేరు

సినీ హీరోయిన్స్ తో పాటు సీరియల్ బ్యూటీస్ కూడా విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నారు. టీవీ సీరియల్స్ లో పాపులర్ అయిన భామల్లో కిశ్వర్ మర్చెంట్ ఒకరు. హిందీలో పలు సీరియల్స్ తో పాపులర్ అయ్యింది ఈ అమ్మడు. ప్యార్ కి యే ఏక్ కహానీ సీరియల్ తో పాపులర్ అయ్యింది. ఈ అమ్మడు నటనతో పాటు అందంతో మెప్పించింది. ఇక ఈ అమ్మడు తనకన్నా చిన్న వాడిని పెళ్లాడింది అతను ఎవరో కాదు ప్యార్ కి యే ఏక్ కహానీ సీరియల్ లో కిశ్వర్ మర్చెంట్ కొడుకు పాత్రలో నటించిన సుయాష్ రాయ్ ను ప్రేమించి పెళ్లాడింది.

ఇవి కూడా చదవండి

14 ఏళ్లల్లోనే ఎంట్రీ.. 300కి పైగా సినిమాలు.. ఇప్పటికీ అదే అందం.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

కిశ్వర్ మర్చెంట్ కంటే సుయాష్ రాయ్ ఎనిమిదేళ్ళు చిన్నవాడు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పటి నుంచి వీరిపై చాలా ట్రోల్స్ వచ్చాయి. ఆతర్వాత ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు పెద్దలు కూడా వెతిరేకించారు. ఇద్దరూ వేరు వేరు మతాలకు చెందిన వారుకావడంతో వీరి పెళ్ళికి పెద్దలు అడ్డు చెప్పారు. కానీ వీరు వివాహం చేసుకున్నారు. తమ పై వస్తున్న ట్రోల్స్ వస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. ఈ జంటకు ఓ కొడుకు ఉన్నాడు. వీరి కొడుకు పై కూడా ట్రోల్స్ వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో ఈ జంట తమ ఫొటోలతో అలరిస్తున్నారు.

11ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్.. అప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఇప్పుడు ఎలా ఉందంటే..

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి