Nenu Meeku Baaga Kavalsinavadini: టీజర్ వచ్చేసింది.. కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమైన కిరణ్ అబ్బవరం..

|

Jul 10, 2022 | 1:08 PM

ఇందులో కిరణ్ అబ్బవరం డ్రైవర్ పాత్రలో కనిపించనున్నట్లుగా టీజర్ చూస్తే తెలుస్తోంది. మరింత స్టైలీష్ లుక్ లో కిరణ్ కనిపించగా..అతని స్నేహితుడిగా బాబా భాస్కర్ నటిస్తున్నాడు.

Nenu Meeku Baaga Kavalsinavadini: టీజర్ వచ్చేసింది.. కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమైన కిరణ్ అబ్బవరం..
Kiran Abbavaram
Follow us on

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇటీవలే సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యంగ్ హీరో.. ప్రస్తుతం నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం నేను మీకు కావాల్సినవాడిని. డైరెక్టర్ శ్రీధర్ గాదే దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. యూత్ ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వస్తోన్న ఈ సినిమా టీజర్ ను ఆదివారం ఉదయం విడుదల చేసింది చిత్రయూనిట్.

ఇందులో కిరణ్ అబ్బవరం డ్రైవర్ పాత్రలో కనిపించనున్నట్లుగా టీజర్ చూస్తే తెలుస్తోంది. మరింత స్టైలీష్ లుక్ లో కిరణ్ కనిపించగా..అతని స్నేహితుడిగా బాబా భాస్కర్ నటిస్తున్నాడు. ఒక్క ప్రేమకే మీరిలా అయిపోతే ఎలా మేడమ్.. పదిసార్లు ప్రేమలో ఓడిపోయినా సరే..సిగ్గులేకుండా పదకొండోసారి ప్రేమ కోసం పరితపించే ప్రేమికుల మధ్య బతుకుతున్నాం..అంటూ కిరణ్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే బాబా బాస్కర్, గెటప్ శ్రీను, కిరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి. ఇందులో కిరణ్ సరసన సంజనా ఆనంద్, సోనూ ఠాకూర్ హీరోయిన్లుగా టనిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.