Allu Arjun: అల్లు అర్జున్‏కు అరుదైన బహుమతి.. 160 ఏళ్ల పురాతన కానుక ఇచ్చి అభిమానాన్ని చాటుకున్న కేరళ మిలియనీర్..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‏కు దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తెలుగులోనే కాకుండా.. బన్నీకి

Allu Arjun: అల్లు అర్జున్‏కు అరుదైన బహుమతి.. 160 ఏళ్ల పురాతన కానుక ఇచ్చి అభిమానాన్ని చాటుకున్న కేరళ మిలియనీర్..
Allu Arjun

Edited By:

Updated on: Sep 29, 2021 | 4:12 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‏కు దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తెలుగులోనే కాకుండా.. బన్నీకి తమిళ్, మళయాలంలో భారీ సంఖ్యలో అభిమానులున్నారు. ముఖ్యంగా కేరళలో బన్నీకి ఉన్న ఫాలోయింగ్ ఏ రెంజ్‏లో ఉంటుందో తెలిసిందే. అక్కడివారంత అల్లు అర్జున్‏ను మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. ఇప్పటివరకు తమిళ్, మళయాలం భాషలలో మారే హీరోకు దక్కని క్రేజ్ బన్నీకి దక్కింది. ఐకాన్ స్టార్ సినిమా కోసం దక్షిణాది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఇప్పటివరకు కేవలం దక్షిణాదిలోనే బన్నీ క్రేజ్ ఎక్కువగా ఉంది. తాజాగా ఈ హీరో పాన్ ఇండియా వ్యాప్తంగా ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్… సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాను చేస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ్, మళయాలంలోనే కాకుండా.. హిందీలోనూ విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉంటే..తాజాగా యూఏఈకి వెళ్లిన అల్లు అర్జున్‏కు అక్కడ ఘన స్వాగతం పలికారు. అంతేకాకుండా.. అక్కడ ఓ మల్టీ మిలియనీర్ అత్యంత పురాతమైన బహుమతిని ఇచ్చారు. కేరళ మూలాలు ఉండి దుబాయ్ లో సెటిలైన మల్టీ మిలియనీర్ రియాజ్ కిల్టన్ యూఏఈలో బన్నీని కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన బన్నీకి 160 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పిస్టల్ ను కానుకగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు ఒమర్ లులు తన ఇన్‏స్టా స్టోరీ ద్వారా తెలిపారు.

వీడియో..

ఇదిలా ఉంటే.. బన్నీ ప్రస్తుతం నటిస్తున్న పుష్ప సినిమాలో పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మళయాలం నటుడి ఫహద్ ఫాసిల్, యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు.

Also Read: Allu Arjun: స్నేహా బర్త్‌డే వేడుకను బన్నీ ఎంత గ్రాండ్‌ చేశారో చూశారా.. ‘నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి’ అంటూ..

Naga Chaitanya: మా ప్రయాణం ఆగిపోతుందని బాధగా ఉంది.. ఈ జర్నీని ఆపొద్దు.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్..

Loading...
Unable to load recommendations.
Follow Us