
1990వ దశకంలోని తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పాటలకు ఇప్పటికీ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ కాలంలోని పాటల సరళమైన, మధురమైన , హృదయాన్ని హత్తుకునే లిరిక్స్ ఇప్పటికీ శ్రోతల శాశ్వతంగా నిలిచిపోయాయి. అలాంటి ఒక పాటే 1995లో విడుదలైన ‘బాంబే’ చిత్రంలోని కన్నానులే.. ఈ పాట తొలిచూపు ప్రేమ అనే అందమైన అనుభవాన్ని, మాటలు లేకుండా భావాలను వ్యక్తపరచడాన్ని వర్ణిస్తుంది. సుమారు 6 నిమిషాల నిడివి గల ఈ పాట ఇప్పటికీ శ్రోతల హృదయాలలో నిలిచిపోయింది. నిజానికి ఈ పాటకు ఇప్పటికీ క్రేజ్ తగ్గడం లేదు. అప్పట్లో తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ పాట సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దాదాపు 31 సంవత్సరాల క్రితం విడుదలైన ఈపాట సంచలన విజయం సాధించింది. అంతేకాదు.. ఆ సమయంలో లక్షలాది కాపీలు అమ్ముడయ్యాయి. ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలోనూ ఈ పాట క్రేజ్, డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు.
ఈ పాట వీడియోలను యూట్యూబ్ , సోషల్ మీడియాలో లక్షలాది సార్లు వ్యూ్స్ వచ్చాయో చెప్పక్కర్లేదు. అలాగే ఎక్కడ విన్నా ఈ పాట మారుమోగుతుంది. మూడు దశాబ్దాల తర్వాత కూడా ఈ పాటకు క్రేజ్ కొనసాగుతూనే ఉంది, ఇది ప్రేక్షకులకు ప్రేమ, భావోద్వేగం , మధురమైన సంగీతంతో కూడిన అందమైన అనుభూతిని అందిస్తూనే ఉంది. బాంబే సినిమా గురించి వస్తే.. మణిరత్నం దర్శకత్వంలో 1995లో వచ్చిన బాంబే (Bombay) కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అదొక క్లాసిక్. అప్పట్లో సమాజంలో ఉన్న సున్నితమైన మతపరమైన అంశాలను, ఒక అందమైన ప్రేమకథతో ముడిపెట్టి ఆయన తెరకెక్కించిన విధానం అద్భుతం. 1992-1993 కాలంలో ముంబైలో జరిగిన మత ఘర్షణల (Bombay riots) నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది.
ఒక పల్లెటూరిలో ఉండే హిందూ యువకుడు శేఖర్ (అరవింద్ స్వామి), ముస్లిం యువతి శైలా బానో (మనీషా కొయిరాలా) ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో, ఇద్దరూ ముంబై (అప్పటి బాంబే) నగరానికి పారిపోయి పెళ్ళి చేసుకుంటారు. వారికి ఇద్దరు పిల్లలు (కబీర్ నారాయణ, కమల్ బషీర్) పుడతారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో, నగరంలో మత ఘర్షణలు చెలరేగుతాయి. ఆ దారుణమైన పరిస్థితుల్లో ఈ కుటుంబం ఎలాంటి కష్టాలు ఎదుర్కొంది, చివరికి మానవత్వం ఎలా గెలిచింది అనేదే ఈ సినిమా. ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏఆర్ రెహమాన్ సంగీతం. “ఉరికే చిలకా”, “కురిసే వెన్నెలా”, “కలగా జరిగిపోయే” వంటి పాటలు ఎవర్గ్రీన్ హిట్స్. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే “బాంబే థీమ్” (Bombay Theme Background Music) ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పటికీ ఎన్నో అంతర్జాతీయ ఆల్బమ్స్‌లో ఈ ట్యూన్‌ని వాడుతుంటారు.