Kangana Ranut: అత్యాచారం, హత్యలకు సపోర్ట్ చేస్తారా..? బాలీవుడ్ ఇండస్ట్రీపై కంగనా పైర్..

అలాగే మరికొందరు బీటౌన్ సెలబ్రెటీలు సీఐఎస్ఎఫ్ సిబ్బందికి మద్దతుగా పోస్టులు పెట్టారు. దీంతో వారందరికీ ట్విట్టర్ వేదికగా కౌంటరిచ్చింది కంగనా రనౌత్. తనపై జరిగిన దాడికి సపోర్ట్ చేసిన వారిపై తన స్టైల్లో విరుచుకుపడింది. అలాంటి వ్యక్తులవి నేరపూరిత ఆలోచనలు అంటూ ప్రశ్నించింది. ఎవరైనా అత్యాచారం లేదా హత్యకు గురైతే సమర్థిస్తారా ? అంటూ ప్రశ్నించింది

Kangana Ranut: అత్యాచారం, హత్యలకు సపోర్ట్ చేస్తారా..? బాలీవుడ్ ఇండస్ట్రీపై కంగనా పైర్..
Kangana Ranaut
Follow us

|

Updated on: Jun 08, 2024 | 9:06 PM

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పై దాడి ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసింది. ఇటీవల చంఢీఘడ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ లేడీ కానిస్టేబుల్ చెంప దెబ్బ కొట్టింది. ఈ ఘటనను చాలా మంది ఖండించారు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ మాత్రం లేడీ కానిస్టేబుల్ కు మద్దతు తెలిపారు. ఒకవేళ ఆమె ఉద్యోగం పోతే తాను ఆమెకు అండగా నిలబడతానని జాబ్ కూడా ఇస్తానని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అలాగే మరికొందరు బీటౌన్ సెలబ్రెటీలు సీఐఎస్ఎఫ్ సిబ్బందికి మద్దతుగా పోస్టులు పెట్టారు. దీంతో వారందరికీ ట్విట్టర్ వేదికగా కౌంటరిచ్చింది కంగనా రనౌత్. తనపై జరిగిన దాడికి సపోర్ట్ చేసిన వారిపై తన స్టైల్లో విరుచుకుపడింది. అలాంటి వ్యక్తులవి నేరపూరిత ఆలోచనలు అంటూ ప్రశ్నించింది. ఎవరైనా అత్యాచారం లేదా హత్యకు గురైతే సమర్థిస్తారా ? అంటూ ప్రశ్నించింది.

“ప్రతి రేపిస్ట్, హంతకుడు లేదా దొంగ.. ఇలా ఎవరైనా నేరం చేయడానికి బలమైన భావోద్వేగ, శారీరక లేదా మానసిక, ఆర్థిక కారణాలు ఉంటాయి. కారణం లేకుండా ఏ నేరం జరగదు. అయితే నేరానికి పాల్పడినవారు దోషులుగా నిర్ధారణ జరిగి శిక్షను ఎదుర్కొంటారు. బలమైన భావోద్వేగ ప్రేరణతో నేరాలకు పాల్పడేవారితో మీరు జతకడితే దేశానికి సంబంధించిన ఎలాంటి చట్టాలనైనా మీరు అతిక్రమిస్తారు. అనుమతి లేకుండా ఇతరులను అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం.. అనుమతి లేకుండా వారి శరీరాలను తాకడం, దాడికి పాల్పడడం మీకు కరెక్ట అనిపిస్తే అత్యాచారం, హత్యలను మీరు సమర్ధిస్తున్నట్లే. మీ మానసిక నేరపూరిత ఆలోచనలను లోతుగా పరిశీలించుకోవాలి. దయచేసి యోగా, ధ్యానం చేయాలని సూచిస్తున్నాను. లేదంటే మీ జీవితం ఒక చేదు, భారంగా మారిపోతుంది. ఎక్కువగా పగ, ద్వేషం, అసూయతో ఉండకండి. దయచేసి స్వేచ్ఛగా ఉండండి” అంటూ సుధీర్ఘ ట్వీట్ చేసింది.

ప్రస్తుతం కంగనా చేసిన ట్వీట్ వైరలవుతుండగా.. కొందరు ఆమెకు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కంగనాను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది కుల్విందర్ కౌర్ అనే మహిళా కానిస్టేబుల్ పై కేసు నమోదైంది. ఈ ఘటనపై విచారణ జరుగుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.