Kangana Ranaut: కంగనాకు కొత్త తలనొప్పులు.. ఓ వైపు హైకమాండ్ వార్నింగ్.. మరోవైపు చంపేస్తామన్న బెదిరింపులు

|

Aug 29, 2024 | 8:35 PM

మర్జెన్సీ సినిమా రిలీజ్‌కు పంజాబ్‌లో తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్‌ చేయరాదని ఆప్‌ ప్రభుత్వం కోరుతోంది. ఖలిస్తాన్‌ మద్దతుదారులు కూడా ఈ సినిమాకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ విడుదల చేశారు. సినిమాను విడుదల చేస్తే కంగనాను చంపేస్తామని ఖలిస్తాన్‌ వాదులు హెచ్చరికలు జారీ చేశారు. 

Kangana Ranaut: కంగనాకు కొత్త తలనొప్పులు.. ఓ వైపు హైకమాండ్ వార్నింగ్.. మరోవైపు చంపేస్తామన్న బెదిరింపులు
Kangana Ranaut
Follow us on

చంపేస్తామని బెదిరింపులు వచ్చినప్పటికి బీజేపీ ఎంపీ కంగనా అదరడం లేదు.. బెదరడం లేదు.. తాను నటించిన ఎమర్జెన్సీ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేస్తానని ప్రకటించారు. బాలీవుడ్‌ పెద్దలు తనను టార్గెట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ మరోసారి వివాదాల క్వీన్‌ అవుతున్నారు. ఓ వైపు హైకమండ్‌ హెచ్చరికలు .. మరోవైపు ఆమెను చంపేస్తామన్న బెదిరింపులు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. రైతులను బంగ్లాదేశ్‌ ఆందోళనకారుల పోల్చి పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు కంగనా . చివరకు అధిష్టానంతో చివాట్లు తిన్నారు.. మరోవైపు కంగనా ఎమర్జెన్సీ సినిమాపై కూడా వివాదం చెలరేగుతోంది. సినిమా విడుదల పదేపదే వాయిదా పడడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కంగనా.. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమర్జెన్సీ సినిమా ధియేటర్లలో విడుదల అవుతుందన్నారు.

ఎమర్జెన్సీ సినిమా రిలీజ్‌కు పంజాబ్‌లో తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్‌ చేయరాదని ఆప్‌ ప్రభుత్వం కోరుతోంది. ఖలిస్తాన్‌ మద్దతుదారులు కూడా ఈ సినిమాకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ విడుదల చేశారు. సినిమాను విడుదల చేస్తే కంగనాను చంపేస్తామని ఖలిస్తాన్‌ వాదులు హెచ్చరికలు జారీ చేశారు.
అయితే బెదిరిపులకు భయపడే ప్రసక్తే లేదంటున్నారు కంగానా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తానని కౌంటర్‌ ఇచ్చారు. ఇంత జరుగుతున్నప్పటికి బాలీవుడ్‌ నుంచి తనకు మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బాలీవుడ్‌లో టాలెంట్‌ ఉన్నవారికి ఎలాంటి గుర్తింపు లభించదని ఆరోపించారు. ప్రోత్సహించే వారు కూడా లేరన్నారు. బాలీవుడ్‌ తనను బాయ్‌కాట్‌ చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌ నిస్సాహాయ ప్రదేశమని సంచలన వ్యాఖ్యలు చేశారు కంగనా. కొంతమంది సెలబ్రిటీలు ఇతరు టాలెంట్‌ను చూసి అసూయ పడుతారన్నారు. అవాస్తవాలు ప్రచారం చేస్తారన్నారు. కెరీర్‌ను నాశనం చేసేందుకు కుట్రలు చేస్తారని మండిపడ్డారు కంగనా. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఎమర్జెన్సీ సినిమా తీశారు కంగనా.. ఈ సినిమాకు ఆమెనే డైరెక్టర్‌ . ఇందిరాగాంధీ పాత్రను ఆమె పోషించారు. తన సినిమాల్లో యాక్టింగ్‌ చేయరాదని చాలామంది నటులపై ఒత్తడి చేశారని కంగనా ఆరోపించారు.
మరోవైపు రైతులపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టారు. చండీగఢ్‌లో ఆప్‌ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బారికేడ్లను తొలగించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు , ఆప్‌ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కంగనా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కంగనా రనౌత్‌ను వెంటనే బీజేపీ నుంచి బహిష్కరించాలని కోరారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.