Kajal Aggarwal: నా విగ్రహం పెట్టిన వారానికే ఘోర దుర్ఘటన.. త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డా: కాజల్ అగర్వాల్

సుమారు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తోంది కాజల్ అగర్వాల్. మొన్నటివరకు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు సహాయక నటిగానూ మెప్పిస్తోంది. తాజాగా 'రామాయణ'లో మండోదరిగా ఎంతో అందంగా కనిపించింది కాజల్. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కాజల్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

Kajal Aggarwal: నా విగ్రహం పెట్టిన వారానికే ఘోర దుర్ఘటన.. త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డా: కాజల్ అగర్వాల్
Kajal Aggarwal

Updated on: Nov 12, 2026 | 8:26 PM

కాజల్ అగర్వాల్.. గత రెండు దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోందీ అందాల తార. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ చందమామ పెళ్లి తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది. కేవలం కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకే ప్రాధాన్యమిస్తోంది. అలా తాజాగా ‘రామాయణ’ సినిమాలో రావణుడి భార్య మండోదరి పాత్రలో అద్బుతంగా నటించింది కాజల్. ఈ సినిమాలో ఆమె అందానికి అందరూ ముగ్దులవుతున్నారు. సుమారు 17 ఏళ్ల క్రితం వచ్చిన మగధీర సినిమాలో రాజకుమారిగా ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే అందంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో కాజల్ కూడా చురుగ్గా పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటోంది. ఈ క్రమంలోనే ‘భారతీయుడు2’ షూటింగ్‌ సందర్భంగా జరిగిన ఘోర ప్రమాదం నుంచి తాను ఎలా బయటపడ్డారో తాజా ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టిందీ చందమామ. నా జీవితంలో అదొక పీడకలని, దేవుడి దయ వల్లే ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డానని పేర్కొంది కాజల్.

‘సరిగ్గా వారం రోజుల ముందే సింగపూర్‌ మేడమ్‌ టుస్సాడ్స్‌లో నా మైనపు విగ్రహం ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. ఆ తర్వాత నేను చెన్నైలో జరుగుతున్న ‘భారతీయుడు 2’ షూటింగ్‌ కోసం వచ్చేశాను. స్వాతంత్రానికి పూర్వం నేపథ్యంలో సాగే యాక్షన్‌ సన్నివేశాలను రాత్రి సమయంలో చిత్రీకరిస్తున్నారు. అప్పుడు నేను 80ఏళ్ల మహిళగా ప్రొస్థటిక్‌ మేకప్‌లో ఉన్నా. మా సీన్స్‌ లేనప్పుడు సాధారణంగా మేమంతా మానిటర్‌కు దగ్గరగా కూర్చొని చూస్తుంటాం. అయితే ఆ రోజు అక్కడ కూర్చోలేదు. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే, ఉన్నట్టుండి 100 అడుగుల భారీ క్రేన్‌ నా కళ్ల ముందే కూలిపోయింది. నా మీద కూడా క్రేన్‌ పడిపోయిందేమో అనుకున్నా. ఎవరో నన్ను చేయిపట్టుకుని వెనక్కి లాగారని అనిపించింది. కళ్ల ముందే ప్రమాదం జరగడంతో నేను భయంతో వణికిపోయా. చాలా సేపు కదలకుండా ఉండిపో యాను. ఒక్కసారి తేరుకుని, అందరితో కలిసి నేను పరిగెత్తడం మొదలు పెట్టా. ఇదంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది. ఆ సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్లు గగురుపొడుస్తుంది. భగవంతుడి దయ వల్లే ఒక్క గాయం కూడా కాకుండా ప్రాణాలతో బయటపడ్డారు. అప్పటి నుంచి కృష్ణుడి భక్తురాలిగా మారిపోయా’ అని అప్పటి క్షణాలను గుర్తు చేసుకుంది కాజల్‌ అగర్వాల్.

ఇవి కూడా చదవండి

కాగా 2020లో ‘ఇండియన్‌2’ షూటింగ్‌ సందర్భంగా క్రేన్‌ కూలిపోవడంతో ముగ్గురు మృతి చెందారు. ఆ ప్రమాదం నుంచి తాను బయటపడటం మిరాకిల్‌ అంటూ అప్పట్లోనూ కాజల్‌ పోస్ట్‌ పెట్టారు. మళ్లీ ఇప్పుడు ఈ విషాద సంఘటలను గుర్తు చేసుకుందీ ముద్దుగుమ్మ.

మండోదరిగా కాజల్ అగర్వాల్..

Loading...
Unable to load recommendations.
Follow Us