Jr.NTR: ఎన్టీఆర్ మంచి మనసు.. అక్కడ చిన్న ఆలయానికి లక్షల విరాళం..

కొన్ని రోజులుగా వార్ 2 చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. బీటౌన్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ యూనివర్స్‏లో తారక్ మెయిన్ రోల్ పోషిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని అప్డేట్స్ రివీల్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట లీక్ అయ్యాయి.

Jr.NTR: ఎన్టీఆర్ మంచి మనసు.. అక్కడ చిన్న ఆలయానికి లక్షల విరాళం..
Jr Ntr
Follow us

|

Updated on: May 16, 2024 | 1:54 PM

జూనియర్ ఎన్టీఆర్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాణం ఇచ్చే అభిమానులు ఉన్నారు. కానీ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ప్రపంచమంతా తారక్ నటనకు ఫిదా అయ్యింది. ఈ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం తెలుగులో దేవర సినిమా చేస్తున్న తారక్.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా వార్ 2 చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. బీటౌన్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ యూనివర్స్‏లో తారక్ మెయిన్ రోల్ పోషిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని అప్డేట్స్ రివీల్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట లీక్ అయ్యాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు తారక్ మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. ఓవైపు వరుసగా సినిమలాతో బిజీగా ఉన్న తారక్.. ఏపీలోని చిన్న ఆలయానికి భారీ విరాళం అందించాడు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్నపేటలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి రూ. 12 లక్షల 50 వేలు విరాళం అందించారు. గుడి వెలుపల దాతల పేర్లను శిలఫలాకపై రాయించారు. ఎన్టీఆర్, భార్య లక్ష్మి ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్, ఎన్టీఆర్ తల్లి షాలిని పేర్లు విరాళం ఇచ్చినట్లు రాశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

చిన్న ఆలయానికి ఎన్టీఆర్ అంత పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడంతో తారక్ అభిమానులు, నెటిజన్స్ అభినందిస్తున్నారు. ప్రస్తుతం తారక్ వార్ 2, దేవర సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు ప్రాజెక్టులపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ రెండు చిత్రాల నుంచి అప్డేట్స్ వస్తాయని భావిస్తున్నారు ఫ్యాన్స్. చూడాలి మరీ.. ఈసారి తారక్ పుట్టినరోజున అభిమానులకు మేకర్స్ ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తారో.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు