
తెలుగు బుల్లి తెరపై అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షో జబర్దస్త్ అని చెప్పవచ్చు. దాదాపు 13 ఏళ్లుగా ఆడియెన్స్ ను అలరిస్తోందీ ప్రోగ్రామ్. ఈ కామెడీ షో గురించి మరో మంచి విషయమేమిటంటే.. ట్యాలెంట్ ఉన్న ఎంతో మంది ఆర్టిస్టులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన ఎంతో మంది నటీనటులు ఇప్పుడు స్టార్ కమెడీయన్లు గా మారిపోయారు. సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉంటోన్న సుడిగాలి సుధీర్, గెటప్ శీను, వేణు, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ తదితరులు జబర్దస్త్ లో చేసిన వారే. వీరిలో చాలా మంది ఇప్పటికీ ఈ కామెడీ షోలోనే కొనసాగిస్తున్నారు. ఇక జబర్దస్త్ లో చేసిన ఆర్టిస్టులంతా దాదాపు బాగా సెటిలయ్యారు. కొందరైతే లగ్జరీ ఇల్లు, బంగ్లాలు, కార్లు కొనేసుకున్నారు. అయితే ఇదే జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీలో పనిచేసిన కమెడియన్ నవదీప్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. హైపర్ ఆదితో పాటు అనేక మంది స్టార్ కమెడియన్స్ తో కలిసి స్కిట్స్ చేసిన ఈ నటుడు ఇప్పుడు రోడ్డుపై పడుకుని ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది,
రోడ్డు మీద పడుకొని ఉన్న నవదీప్ ను చూసిన ఒక వ్యక్తి దగ్గరకి వెళ్లి వీడియో తీయడం మొదలు పెట్టాడు. నవదీప్ ను లేపి ‘ నిన్ను ఎక్కడో చూసానే, టీవీ లో వస్తుంటావు కదా నువ్వు అని అడగ్గా ‘లేదు అన్నా.. వీడియో తియ్యకు.. పో ‘ అని అన్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ‘లేదు లేదు.. నేను నిన్ను జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ టీవీ షోల్లో చూశాను , ఏమైంది, ఎందుకు ఇలా అయిపోయావు ‘ అని అడిగాడు. దీనికి నవదీప్ ‘ ఒక అమ్మాయిని ప్రాణం గా ప్రేమించాను. కానీ నన్ను మోసం చేసింది. 30 లక్షల డబ్బులు ఉండేవి నా దగ్గర. మొత్తం IPL లో పెట్టి పోగొట్టింది. ఇప్పుడు తినేదానికి కూడా నా దగ్గర ఏమి లేదు’ అని అన్నాడు. ఈ వీడియో కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారింది.
అయితే నవదీప్ కేవలం డ్రామా చేస్తున్నాడని, నిజమని అనిపించడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. ప్లాన్ చేసి మరీ ఈ వీడియోను షూట్ చేసినట్లు ఉందని, అసలు నమ్మశక్యంగా లేదని కామెంట్స్ పెడుతున్నారు. మరి జబర్దస్త్ నవదీప్ నిజంగానే కష్టాల్లో ఉన్నాడో? లేదా సోషల్ మీడియా అటెన్షన్ కోసం ఇలా చేస్తున్నాడా? అన్నది తెలియాల్సి ఉంది.
Jabardasth Navdeep
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.