Rashmi Gautam: నా కుటుంబం చచ్చినా పర్లేదు.. జబర్దస్త్ యాంకర్ రష్మీ సంచలన పోస్ట్.. అసలు ఏం జరిగిందంటే?

ప్రముఖ బుల్లితెర నటి, జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది. కాగా ఈ ముద్దుగుమ్మకు సామాజిక స్పృహ కూడా ఎక్కువే. ఈనేపథ్యంలో తాజాగా రష్మీ షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Rashmi Gautam: నా కుటుంబం చచ్చినా పర్లేదు.. జబర్దస్త్ యాంకర్ రష్మీ సంచలన పోస్ట్.. అసలు ఏం జరిగిందంటే?
Jabardasth Anchor Rashmi Gautam

Updated on: Nov 19, 2026 | 6:41 PM

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బుల్లితెరపై బాగా బిజీగా ఉంటోన్న యాంకర్లలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ తదితర షోల్లోనూ సందడి చేస్తోందీ అందాల తార. అలాగే అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తోంది. సినిమాలు, టీవీషోస్ సంగతి పక్కన పెడితే.. రష్మీకి సామాజిక స్పృహ ఎక్కువ. సమాజంలో జరిగే అన్యాయాలు, దారుణాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటుంది. మహిళలు, చిన్నపిల్లలకు సంబంధించిన విషయాల్లో బలంగా తన గొంతు వినిపిస్తుంటుంది. అన్నిటికీ మించి మూగ జీవాలంటే ఈ అమ్మడికి విపరీతమైన ప్రేమ. వాటికి చిన్న హాని జరిగినా తట్టుకోలేదు. అందులో భాగంగానే వీధి కుక్కల సంరక్షణ, మూగజీవాలపై జరిగే దాడులకు వ్యతిరేకంగా ఆమె ఎప్పటికప్పుడు గళమెత్తుతుంటుందీ అందాల యాంకరమ్మ. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి తన జంతు ప్రేమను చాటుకున్నారు రష్మీ గౌతమ్. మూగజీవాలపై జరిగే అకృత్యాల పట్ల సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కొందరు చిన్నారులు కలిసి ఆరు అమాయకపు కుక్కపిల్లలను అత్యంత కిరాతకంగా కొట్టి, నిప్పు పెట్టి సజీవ దహనం చేశారు. వినగానే ఒళ్లు జలదిరించేలా ఉన్న ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ అమానుష సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన జంతు ప్రేమికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూగజీవాల హృదయవిదారక దృశ్యాలను చూసి చలించిపోయింది రష్మీ గౌతమ్. అనంతరం సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ పెట్టింది.

‘దేవుడా.. దయచేసి ఒక భయంకరమైన ప్రకృతి విపత్తును పంపించు. అందులో నా సొంత కుటుంబం, నాకు అత్యంత ఇష్టమైన వాళ్లు బలైపోయినా నేను అస్సలు పట్టించుకోను. కానీ ఈ భూమిపై ఒక ప్రక్షాళన జరగాలి.. అది మనకు అత్యవసరంగా కావాలి’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది రష్మీ. ప్రస్తుతం ఈ జబర్దస్త్ యాంకరమ్మ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు యాంకర్ రష్మీకి మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. మూగజీవాల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us