Jabardasth Dhanraj: క్యాన్సర్‌తో తల్లి మరణం.. చేతిలో చిల్లిగవ్వలేని ధన్‌రాజ్‌కు బంగారమిచ్చి సాయం చేసిందెవరంటే?

కెరీర్ ప్రారంభంలోనే జగడం, పరుగు, భీమిలీ కబడ్డీ జట్టు వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు ధన్ రాజ్. కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత జబర్దస్త్ లోనూ అడుగు పెట్టి టీమ్ లీడర్ కూడా అయ్యాడు.

Jabardasth Dhanraj: క్యాన్సర్‌తో తల్లి మరణం.. చేతిలో చిల్లిగవ్వలేని ధన్‌రాజ్‌కు బంగారమిచ్చి సాయం చేసిందెవరంటే?
Jabardasth Dhanraj Family

Updated on: Nov 19, 2026 | 8:47 PM

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో ధనాధన్ ధన్ రాజ్ ఒకడు. చూడ్డానికి బక్కగా ఉన్నా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించడంలో ధన్‌రాజ్ ఘనాపాటి. కాగా జబర్తస్త్ కంటే ముందు కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు ధన్‌రాజ్. 2007లోనే రామ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన జగడం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో అతను పోషించిన నాంపల్లి సత్తి పాత్ర బాగా హైలెట్ అయ్యింది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పరుగు సినిమాలో బన్నీ స్నేహితుడి పాత్రలోనూ కడుపుబ్బా నవ్వించాడు ధన్ రాజ్. ఇవే కాక యువత, గోపి గోపిక గోదావరి, పిల్ల జమీందార్, కెమెరామెన్ గంగతో రాంబాబు, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, గోపాల గోపాల.. ఇలా దాదాపు 80కు పైగా సినిమాల్లో నటించి నవ్వించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. కేవలం సినిమాలే కాకుండా మధ్యలో జబర్దస్త్ షోలోనూ సందడి చేశాడీ కమెడియన్. తన ట్యాలెంట్ తో టీమ్‌ లీడర్‌ దాకా ఎదిగాడు. ఇక ‘బుజ్జీ ఇలారా’ సినిమాతో హీరోగానూ మెప్పించిన ధన్ రాజ్ ఆ మధ్యన రామం రాఘవం సినిమాతో దర్శకుడిగానూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అయితే ధనరాజ్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడట. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడట. ఒకానొక సమయంలో తల్లి క్యాన్సర్ తో చనిపోతే ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు అతని దగ్గర చేతిలో చిల్లిగవ్వ లేదట. అలాంటి క్లిష్ట సమయంలో ధన్ రాజ్ భార్య శిరీషనే తన బంగారం మొత్తం అతనికి ఇచ్చేసిందట. ఈ విషయాన్ని ఆమెనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

‘ధనరాజ్‌ సొంతూరు విజయవాడ. నాది ఖమ్మం. ధనరాజ్‌ ఫిలిం నగర్‌ లో ఒక డ్యాన్స్‌ స్టూడియో పెట్టినప్పుడు టీచర్‌ కోసం వెతుకుతున్నారు. నేను స్వతహాగా క్లాసికల్‌ డ్యాన్సర్‌ ని కావడంతో ఒకసారి నన్ను కలిశాడు. అయితే దురదృష్టకరమైన విషయమేమిటంటే.. నేను పరిచయమైన రోజే ధన్ రాజ్ తల్లి క్యాన్సర్‌ తో కన్నుమూసింది. సాధారణంగా దీనిని చాలా మంది చాలా రకాలుగా తీసుకుంటరాఉ. కానీ దీనిని కూడా ధన్ రాజ్ చాలా పాజిటివ్ గా తీసుకున్నాడు. తన తల్లి వెళ్లిపోతూ నన్ను అతడికి ఇచ్చిందని ధనరాజ్‌ ఫీలయ్యాడు. అయితే తల్లి అంత్యక్రియలు చేయడానికి కూడా అప్పుడు ధన్ రాజ్ దగ్గర సరిపడా డబ్బు లేదు. దీంతో నా దగ్గరున్న బంగారం ఇచ్చేశాను. మాది లవ్ మ్యారేజ్. అది కూడా నేనే ప్లాన్‌ చేశాను. రేపు మన పెళ్లి అనగానే సరేనని వెంటనే తలూపాడు. ఇంట్లో వాళ్లకు ఎదురు తిరిగి 15 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాను. మా పెళ్లయిన మూడో రోజే జగడం సినిమా విడుదలైంది. అక్కడి నుంచి ధనరాజ్‌ కు సినిమా అవకాశాలు పెరిగాయి’ అని చెప్పుకొచ్చింది ధన్ రాజ్ భార్య.

ఇవి కూడా చదవండి

ఫ్యామిలీతో జబర్దస్త్ ధన్ రాజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us